»   » ప్రభాస్ గుర్రం స్వారీ నేర్చుకుంటుంది ఏ చిత్రం కోసం అంటే..?

ప్రభాస్ గుర్రం స్వారీ నేర్చుకుంటుంది ఏ చిత్రం కోసం అంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ ప్రస్తుతం గుర్రం స్వారీ నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ ఏ సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్నాడూ అంటే రాజమౌళి తదుపరి చిత్రం కోసమని తేలింది. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఓ పీరియడ్ మూవీ గా తెరకెక్కించనున్నాడు. ఇందుకోసం ప్రభాస్ ని గుర్రపు స్వారీ,కత్తి తిప్పటం నేర్చుకోమన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తన గురువు రాఘవేంద్రరావు నిర్మాతగా రూపొందించనున్నారు. స్క్రిప్టు వర్కు ప్రస్తుతం జరుగుతోంది. మర్యాదరామన్న చిత్రం విడుదల తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని ఈ చిత్రం ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు రాజమౌళి చెప్తున్నారు. మర్యాద రామన్న చిత్రం రేపే(శుక్రవారం) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu