»   » కన్నడ రీమేక్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

కన్నడ రీమేక్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Prabhas’s next is sandalwood re-make
హైదరాబాద్: ప్రస్తుతం బాహుబలి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆ చిత్రం రీసెంట్ గా కన్నడంలో విడుదలై సూపర్ హిట్టైన ఉగ్రం రీమేక్ అని తెలుస్తోంది. రీసెంట్ గా ఓ పెద్ద నిర్మాత ప్రభాస్ ని కలిసి ఈ ప్రపోజల్ పెట్టారని, ఈ మేరకు ప్రభాస్ ఆ చిత్రం కాపీని తెప్పించుకుని చూసారని చెప్తున్నారు. చూసిన వెంటనే ప్రభాస్ ఓకే చేసారని అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. గతంలో ప్రభాస్...కన్నడ చిత్రం జోగి రీమేక్ యోగి చేసిన విషయం తెలిసిందే.

తమిళం నుంచి సైతం రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడిన ఈ చిత్రం కన్నడంలో రికార్డులు క్రియేట్ చేసే దిసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా చూడకుండానే టాక్ విని తెలుగునుంచి ఇద్దరు హీరోలు ఈ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు అక్కడ మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళు ఎవరో కాదు ఎన్టీఆర్, అల్లు అర్జున్. అయితే ఊహించని విధంగా ప్రభాస్ సీన్ లోకి వచ్చారు. చిత్రంలో హై ఓల్టేజి యాక్షన్ సీన్స్ ఉండటంతో తెలుగుకి ఇది వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

మరో ప్రక్క ధనుష్ ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో చేయటానకి ఉత్సాహం చూపిస్తాడని చెప్తున్నారు. నార్త్ కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో నేరేషన్ హైలెట్ గా చెప్తున్నారు. మొదటి నుంచి చివరి వరకూ చాలా గ్రిప్పింగ్ గా సినిమా ని తీసాడని,యాక్షన్ ప్యాకెడ్ సీక్వెన్స్ లకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. రౌడీ రాజ్యంగా నడిచే ఓ ప్రాంతానికి తన స్నేహితుడుని కలవటం కోసం హీరో వస్తాడు. అక్కడ తన కళ్లెదురుగా ఓ అమ్మాయిని అక్కడ లోకల్ రౌడీలు రేప్ చేస్తూంటే చూస్తూ ఊరుకోలేకపోతాడు. దాంతో ఊరంతా సైలెంట్ గా ఉన్నా హీరో యాక్షన్ లోకి దిగి ఆ డాన్ ని చంపేసి,అక్కడ పరిస్దితులని తన చేతుల్లోకి తీసుకుని దారుణాలని అరికట్టాలని చూస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగిందనే కథాంశం చుట్టూ సినిమా నడుస్తుంది.

English summary
Talk about Young Rebel Star Prabhas' next project is already gaining momentum. According to the latest Prabhas who is starring in ‘Bahubali’is showing interest in Kannada super hit ‘Ugram’ starring Srimukhi under Prasanth Neil direction. Though NTR and Allu Arjun showed interest in this re-make, the offer now came to Prabhas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu