»   » క్లారిటీ : ‘బాహుబలి’ పార్ట్ 2 కన్నా ముందే రిలీజ్

క్లారిటీ : ‘బాహుబలి’ పార్ట్ 2 కన్నా ముందే రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం ఎక్కడ విన్నా ప్రభాస్ తాజా చిత్రం ‘బాహుబలి' గురించే కబుర్లు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభాస్ చేయబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టీ పడింది. ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని రన్ రాజా రన్ దర్శకుడుతో చేయటానికి ఖరారు చేసుకున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇన్నాళ్లూ కన్ఫూజన్ లో ఉన్న విషయం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం చివర్లో అంటే బాహుబలి 2 వచ్చే లోగా ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వాస్తవానికి ...ప్రభాస్ తదుపరి చిత్రం ఏం చేయబోతున్నారనేది ప్రభాస్ అభిమానుల్లోనే కాక సినీ అభిమానుల్లోనూ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే రాజమౌళి తో చేసిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి తర్వాత చేయబోయే చిత్రం ఎంపిక చాలా క్లిష్టమైనది. అయితే ఆల్రెడీ ప్రభాస్ ... కథ విని డైరక్టర్ ని ఓకే చేసేసాడని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు నెట్ జనులకు షార్ట్ ఫిల్మ్ మేకర్ గా...బయిట జనాలకు రన్ రాజా రన్ దర్శకుడుగా పరిచయం అయిన సుజీత్.


Prabhas’s next with UV Creations gets a release date

ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఉప్పలపాటి కో ప్రొడ్యూసర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ కృష్ణా రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తారు.మిస్టర్ ఫెరఫెక్ట్, వర్షం చిత్రాల తరహా కథతో ఈ చిత్రం ఉండబోతోందని, రన్ రాజా రన్ తరహా ఫ్రెష్ నేరేషన్ తో సబ్జెక్టుని డీల్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సుజీత్ ఇప్పటివరకూ 50కు పైగా షార్ట్ ఫిలింలు చేసారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి స్ధాయిలో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.


ఇక ప్రభాస్ తాజా చిత్రం భాక్సాఫీస్ విషయానికి వస్తే..


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి' ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం దాదాపుగా రూ.68 కోట్ల షేర్‌ వసూలు చేసి ట్రేడ్‌ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది భారతీయ చిత్రపరిశ్రమ రికార్డుగా ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.


ఇది వరకు షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' రూ.65 కోట్లు సాధించిందని సమాచారం. ఆ లెక్కన బాలీవుడ్‌ రికార్డులూ పటాపంచలైనట్టే. ఒక్క హిందీ అనువాదమే రూ.5 కోట్లు వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. హిందీలో అనువాదమైన ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు దక్కడం ఇదే ప్రథమం.


విదేశాల్లో అయితే 'బాహుబలి' చెలరేగిపోతోంది. గురు, శుక్రవారాలు కలిపి ఒక్క అమెరికాలోనే 2.4 మిలియన్‌ డాలర్లు సంపాదించింది. మొత్తంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో రూ.16 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.36 కోట్ల రూపాయల షేర్‌ సాధించినట్టు తెలుస్తోంది.

English summary
Prabhas confirmed his next with UV Creations with the young director Sujith. Now the makers are in due plans to release the film prior to Baahubali part two.
Please Wait while comments are loading...