Spirit Movie : ప్రభాస్‌కి విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు.. ‘స్పిరిట్’షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..
Spirit Movie: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు మాత్రమే ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేయగలరు. అలాంటి నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సలార్, కల్కి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆయన, ప్రతి సారి కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న రాజాసాబ్ తర్వాత ప్రభాస్ త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా, వచ్చే నెల నుంచి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో Spirit సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సర్వసిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ప్రభాస్ విలన్ పాత్రలో ఉంటాడనే వార్తలు వినిపించాయి.
ఇక స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. సందీప్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, దాని రీమెక్ కబీర్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తరువాత రణ్‌భీర్ కపూర్‌తో 2023లో ఎనిమల్ మూవీలో రూ.900 కోట్లకు పైగా వసూళ్లను అందించాడు. ఇప్పుడు అదే క్రేజీ ఫేంస్‌తో స్పిరిట్ అనే పాన్ ఇండియా మూవీని ప్రభాస్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు.

ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో మూవీ అనగానే ఆశలు అమాంతం పెరిగాయి. సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకి వెళ్లనుండకపోయినా, ఫ్యాన్స్, సినీ వర్గాల ఉత్కంఠ పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం సందీప్ సినిమాలోని క్యారెక్టర్ కాస్టింగ్. ఇప్పటివరకు వచ్చిన లీక్‌ల ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వివేక్ ఒబెరాయ్ సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే తన విలన్ పాత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాడు.
గతంలో క్రిష్ 2 లో హృతిక్ కు ప్రతినాయకుడిగా, అలాగే రామ్ చరణ్- బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ్ లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇప్పుడు ప్రభాస్‌కి ఎదురుగా న్యూ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. సందీప్ రెడ్డి తన సినిమాల్లో విలన్ పాత్రను ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఎనిమల్ సినిమాలో విలన్ పాత్రను ప్రత్యేక శైలిలో పరిచయం చేశారు. అదే విధంగా సిర్పిట్ లో కూడా వివేక్ ఒబెరాయ్‌కి సరికొత్త లుక్, స్టైల్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక హీరోయిన్ పాత్రలో మొదట దీపికా పదుకొనే ను తీసుకోవాలని భావించారు. కానీ, ఆమె తప్పించడంతో, ఇప్పుడు త్రిప్తి దిమ్రి కథానాయికగా ఈ సినిమాలో అవకాశం పొందనున్నారు. ఈ కాంబినేషన్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో సినిమాలో యాక్షన్, డ్రామా, మిస్ట్రీ హైలైట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇలా మొత్తానికి స్పిరిట్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలు సృష్టిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా, త్రిప్తి దిమ్రి కథానాయికగా, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో, ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అంచనాలను ఇస్తూ, భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇంకా అధికారిక అప్‌డేట్‌లు రాకముందు, ఫ్యాన్స్ ఉత్కంఠతో వేచివున్నారని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











