ది రాజా సాబ్ సాంగ్స్ లీక్.. మరోసారి ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ స్టెప్పులు
డార్లింగ్ అభిమానులకు ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీతో అలరించబోతున్న చిత్రం ది రాజా సాబ్. బాహుబలి చిత్రం తర్వాత నుంచి ప్రభాస్ సీరియస్ పాత్రలు, యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఇక ఫ్యాన్స్ తమ డార్లింగ్ ను తిరిగి వెండితెరపై చూడాలని, ప్రభాస్ లోని హ్యూమర్, కామెడీని, అలాగే రొమాంటిక్ గా చూడాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ హార్రర్ అంశాలతో ది రాజా సాబ్ చిత్రం రూపుదిద్దుకుంటుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇక ది రాజా సాబ్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ చిత్రంలోని భారీ విజువల్స్ కారణంగా సినిమా రిలీజ్ మరింతగా ఆలస్యం అవుతుందని మేకర్స్ ప్రకటించారు. దాంతో 2025 డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపిన సంగతి తెలిసిందే. రీలీజ్ ఇంకా సమయం ఉండటంతో సినిమా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినీ వర్గాలో ది రాజా సాబ్ సినిమాకు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రచారం అవుతున్నాయి.

ముఖ్యంగా ది రాజా సాబ్ సాంగ్స్ పై మాట్లాడుకుంటున్నారు. ది రాజా సాబ్ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటలు, బీజీఎంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ది రాజా సాబ్ చిత్రంలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఎలాంటి పాటలను రెడీ చేస్తున్నారనేది ఆసక్తిరంగా మారింది. ఈ చిత్రంలో ప్రధానంగా 5 సాంగ్స్ ఉంటాయని చెబుతున్నారు. అందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
ది రాజా సాబ్ చిత్రంలో ఇంట్రో సాంగ్, ఒక మెలోడీ సాంగ్, ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని అందులో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేస్తారని చెబుతున్నారు. అలాగే యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మాళవికా మోహన్ తో మరో మాస్ సాంగ్ ను ప్లాన్ చేశారని, ప్రభాస్ వింటేజ్ లుక్ తో ప్లాన్ చేశారని టాక్. అలాగే థమన్ స్టైల్ లో ది రాజా సాబ్ థీమ్ సాంగ్ కూడా ఉంటుందని తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ బాహుబలితో ముగ్గురు హీరోయిన్లతో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మళ్లీ ది రాజా సాబ్ లో ముగ్గురు హీరోయిన్లతో దుమ్ములేపబోతున్నారని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అయితే సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, యోగి బాబు, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో అలరించబోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











