Prabhas పక్కన ముగ్గురు టాప్ హీరోయిన్లు.. కామెడీ డైరెక్టర్ ప్యాన్ ఇండియా మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు దూరంగా ఉండటంతో కొన్ని వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రాధేశ్యామ్ బాక్సాఫీస్ ఫలితం నిరాశజనకంగా ఉండటంతో యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం తన స్ట్రాటెజీని మార్చుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా భారీ బడ్జెట్, ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా, వేగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభాస్ తీసుకొన్నట్టు సమాచారం. ఆ క్రమంలో దర్శకుడు మారుతితో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేసినట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రభాస్, మారుతికి సంబంధించిన సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్

డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్

రాధేశ్యామ్ మూవీ రిలీజ్ తర్వాత పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ విదేశీ విహారయాత్రకు ప్లాన్ చేసుకొన్నాడు. ఓ వైపు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే తదితర సినిమాలతో బిజీగా ఉన్న ఆయన మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. దర్శకుడు మారుతితో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఫారీన్ టూర్ నుంచి తిరిగి వచ్చే లోపే సినిమాకు సంబంధించిన ప్రీ పోడక్షన్ పనులు పూర్తి చేసుకోవాలని సూచించినట్టు సమారారం.

2022లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్

2022లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్

మారుతితో కలిసి చేసే సినిమాపై ప్రభాస్ పూర్తి క్లారిటీతో ఉన్నాడు. కేవలం నాలుగు, ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందే సినిమాను 2022లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ ఆలోచనకు తగినట్టే మారుతి కూడా తన సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ సినిమాతోపాటు మరో ప్యాన్ ఇండియా సినిమాను మారుతి లైన్‌లో పెడుతున్నట్టు తెలిసింది.

సింపుల్, ఫన్, కామెడీ ఎంటర్‌టైనర్ కథతో

సింపుల్, ఫన్, కామెడీ ఎంటర్‌టైనర్ కథతో

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వచ్చే సినిమా భారీగా కాకుండా సింపుల్‌గా, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ఉండే విధంగా కథను సిద్ధం చేశారు. బిగ్ బడ్జెట్, సుదీర్ఘకాలం షూటింగ్ లేకుండా త్వరగా ముగించే విధంగా సినిమాను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులను, ప్రభాస్ అభిమానులను టార్గెట్‌గా చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ముగ్గురు హీరోయిన్లు ఎవరంటే?

ముగ్గురు హీరోయిన్లు ఎవరంటే?

మారుతి దర్శకత్వంలో రూపొందే వినోదాత్మక చిత్రంలో ప్రభాస్‌ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్లు కృతిశెట్టి, మాళవిక మోహనన్, శ్రీలీల నటించే అవకాశం ఉంది. ఈ సినిమా మారుతి మార్కుతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

ప్రభాస్ సినిమా కెరీర్ ఇలా..

ప్రభాస్ సినిమా కెరీర్ ఇలా..

ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలతో భారీ లైనప్‌ను రెడీ చేశారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓంతో కలిసి ఆదిపురుష్, నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పిరిట్ అనే భారీ బడ్జెట్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X