»   » ప్రభాస్ కి పోటీనా...నెవర్..ప్రభాస్ కి తిరుగులేదంతే...

ప్రభాస్ కి పోటీనా...నెవర్..ప్రభాస్ కి తిరుగులేదంతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజకీయాలతో పాటు వారసుల పేరు వినబడేది సినీ పరిశ్రమలో మాత్రమే. అది తెలుగు పరిశ్రమలో మరీ ఎక్కువ. ఇప్పటికే వంశ చరిత్రలు చెప్పుకుని రోజుకో హీరో పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడినంటూ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాడు సిద్దార్థ్ రాజ్ కుమార్. ఎంట్రీకి ముందే చాలా చోట్ల ప్రభాస్ కి పోటీ ఎదురుకానుంది అని టాక్ వ్యాపించినప్పటికీ అతనిలో అంతసీన్ లేదని 'కెరటం" ఆడియో ఫంక్షన్ లో సిద్థార్థ్ రాజ్ కుమార్ ని చూసిన వాళ్లు అనుకోవడం వినబడింది.

ఇప్పుడున్న హీరోల్లో ఎవరికి లేని 6 అడుగుల హైట్, దిట్టమైన పర్శనాలిటీతో పాటు మాస్ ఇమేజ్ ఉండటం ప్రభాస్ కి అతి పెద్ద అడ్వాంటేజ్. దీనికి తోడు రీసెంట్ గా డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ లతో లవర్ బాయ్ గా కూడా గెలిచాడు. ఫేస్ లో హీరో అనే లక్షణమే లేని ఇంకా నూనూగు మీసాలు కూడా రాని సిద్ధార్థ్ ప్రభాస్ కి పోటీనా? ఛాన్సేలేదు అంటున్నారు రెబల్ స్టార్ వీరాభిమానులు...

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మరో రీ మేక్ పై మనసు పడ్డాడు..తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన 'బిల్లా" చిత్రాన్ని ప్రభాస్ తో అదే పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు మెహర్ రమేష్. కాగా ప్రస్తుతం అజిత్ హీరోగా, చక్రితోలేటి దర్శకత్వంలో 'బిల్లా" సీక్వెల్ 'బిల్లా2" రూపొందుతోంది. ఇక ఈ చిత్రంపై కూడా ప్రభాస్ ఆసక్తిగా వున్నాడట. 'బిల్లా2ను" కూడా తెలుగులో చేయాలని తహతహలాడుతున్నాడట ఈ యంగ్ రెబల్ స్టార్ ఇందుకోసం ప్రభాస్ ఓ ప్రముఖ నిర్మాతకు బిల్లా2 రైట్స్ ను కొనుగోలు చేయమని ఆదేశించాడట...

English summary
Entered the Tollywood with ‘Eeshwar,’ today prabhas is one of the top star in industry with immense Fan following. In fact some people consider him as the perfect hero material suitable for Bollywood and even Hollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu