»   »  టాక్ తేడా అంటున్నారు...ఏమవుతుందో

టాక్ తేడా అంటున్నారు...ఏమవుతుందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న 'ఉలవచారు బిర్యాని' ఈ రోజు విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ మరియు కన్నడ బాషలలో రానున్న ఈ రొమాంటిక్ డ్రామా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షోని నిన్న(గురువారం)రాత్రి హైదరాబాద్ లో వేసారు. మీడియా ప్రతినిధులు,సినిమావారు ఈ షోకు హాజరయ్యారు. ఈ షో చూసినవారు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవటం కష్టమే అని పెదవి విరుస్తున్నారు.

ప్రకాష్ రాజ్ చెప్పినంత గొప్పగా ఈ సినిమా లేదని అంటున్నారు. ఫస్టాఫ్ కొన్ని మంచి సన్నివేశాలతో బాగున్నా...సెకండాఫ్ బాగా దారుణంగా ఉందని మీడియాలో ప్రచారం అవుతోంది. ధోణి చిత్రంతో నిరాశపడిన ప్రకాష్ రాజ్ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశగా ఉన్నారు. అయితే ఆ ఆశలు నెరవేరే పరిస్ధితి కనపడటం లేదని చెప్తున్నారు. ముదురు వయస్సు ప్రేమ కథకు తోడు, స్లో పేస్ లో సినిమా నడుస్తుందని, చాలా ప్రెడిక్టబుల్ కథనం అని చెప్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ షో చూసిన సినిమావాళ్లలో చాలా మంది ఒరిజనల్ సాల్ట్ అండ్ పెప్పర్ చిత్రం చూసిన వారు కావటంతో ఈ టాక్ ని పూర్తిగా నమ్మి పరిగణన లోకి తీసుకోలేం.

Prakash Raj's Ulavacharu Biryani Premiere Talk

'ఉలవచారు బిర్యాని' చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన 'సాల్ట్ ఎన్ పెప్పర్' కు రిమేక్. ఈ సినిమాలో స్నేహ మరియు ఊర్వశినటిస్తున్నారు . ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది.

మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు.

English summary

 Ulavacharu Biryani film is premiered to press and film celebrities at Prasadz multiplex on Thursday evening. Ulavacharu Biryani is a remake of Malayalam film Salt and Pepper. Prakash Raj, Sneha, Tejass and Samyuktha played the lead roles and music was scored by Ilayaraja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu