»   » ఆ ఫ్లాఫ్ డైరక్టర్ తో రామ్ చరణ్ నెక్ట్స్ ప్లానింగ్

ఆ ఫ్లాఫ్ డైరక్టర్ తో రామ్ చరణ్ నెక్ట్స్ ప్లానింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనగనగా ఒక ధీరుడు చిత్రంతో పరిచయమైన ప్రకాష్ కోవెల మూడి తన తదుపరి చిత్రానికి హీరోగా రామ్ చరణ్ ని ఎంచుకున్నాడని సమాచారం.తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు ..అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ ప్లానింగ్ చేస్తున్నాడు.రాఘవేంద్రరావు,ప్రకాష్ కలిసి ఈ ప్రపోజల్ తో కొద్ది రోజుల క్రితం చిరంజీవిని కలిసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.చిరంజీవి స్క్రిప్టు చదివిన తర్వాత ఫైనలైజ్ చేద్దామని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు.

అనగనగా ఒక ధీరుడు చిత్రం కథ బాగోలేక ఫ్లాఫ్ అయింది కాని టెక్నికల్ గా ఫెయిల్యూర్ కాలేదని కాబట్టి మంచి స్క్రిప్టు అయితే తాను చేయటానకి రెడీనే అన్నట్లు రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు.అందులోనూ రామ్ చరణ్,ప్రకాష్ ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా కావటం కలిసి వచ్చే అంశం.అన్నీ కలిసి వస్తే సంపత్ నందితో రామ్ చరణ్ చేసే చిత్రం తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.

English summary
Prakash To Start 'Jagadeka Veerudu Athiloka Sundari' Sequel With Ram Charan. It is worth mentioning here that Ram Charan and Prakash were close pals right from their childhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu