For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్: 'బాద్‌షా' కి అప్పుడే నాలుగో సారి మార్పు

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాద్షా. ఈ చిత్రంకి కెమెరామెన్ లను వరసగా మార్చుకుంటూ శ్రీను వైట్ల రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆయన దూకుడు కెమెరామెన్ గుహన్ ని తీసుకువచ్చి ట్విస్ట్ ఇచ్చారు. దాదాపు సగం షూటింగ్ పూర్తైన తర్వాత కూడా కెమెరామెన్ ని మార్చటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బెస్ట్ క్వాలిటీ కోసమే శ్రీను వైట్ల ఈ మార్పు చేస్తున్నాడని చెప్తున్నా, ఇప్పుడువరకూ మారిన కెమెరామెన్స్ అందరూ ప్రూవ్ చేసుకున్నవారే కావటం విషేషం.

  వివరాల్లోకి వెళితే... మొదట ఈ చిత్రానికి ఆండ్రూని అనుకున్నారు. ఆడ్రూ చేసిన కందిరీగ,ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలలో ఛాయా గ్రహణం చూసి ఈ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇటలీ షెడ్యూల్ అయిన తర్వాత ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చలేదని వద్దన్నారు. ఆ తర్వాత ఆప్లేస్ లోకి జయన్ విన్సెంట్ వచ్చారు. పవన్ కల్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ వర్క్ నచ్చిన శ్రీను వైట్ల ఆయన్ను తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన్ను కూడా కాదన్నారు.

  బ్యాంకాక్ షెడ్యూల్ లో ఆయన వర్క్ స్టైల్ నచ్చలేదని వద్దన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్లేస్ లోకి ఆర్.డి. రాజశేఖర్ ని తీసుకుంటున్నారు. ఈ రంకంగా ఈ చిత్రానికి మూడో కెమెరామెన్ ఆర్.డి.రాజశేఖర్ అవుతారు. ఇప్పుడు ఆర్.డి.రాజశేఖర్ పనితనం కూడా నచ్చక ఆయన్ని తీసివేసి గుహన్ ని సీన్ లోకి తెచ్చారు. గుహన్ గతంలో శ్రీనువైట్లతో దూకుడు చిత్రం చేసారు. దూకుడు చిత్రం దాదాపు సెవెంటీ పర్శంట్ షూటింగ్ జరిగిన తర్వాత అప్పటి వరకూ పనిచేసిన ప్రసాద్ మూరెళ్లని కాదని, కెవి గుహన్ ని సీన్ లోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరి ఆ సెంటిమెంట్ ని రిపీట్ చెయ్యాలనుకున్నారో ఏమో కానీ ఇలా నాలుగో కెమెరామెన్ ఈ సినిమాకు మారారు.

  ఇవన్నీ ఎలా ఉన్నా ఈ చిత్రం గ్యారెంటీగా ఎన్టీఆర్ కు సూపర్ హిట్ ఇస్తుందంటున్నారు. ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''వినోదాత్మకమైన కథ ఇది. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. హైదరాబాద్‌ పరిసరాల్లోనే షూటింగ్ త్వరలో మొదలుపెడతాం. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయి''అని చెప్పారు. వినోదాన్ని యాక్షన్‌ కథల్లో మేళవించే దర్శకుడు శ్రీను వైట్ల. కథానాయకుడి చేత పోరాటాలతో హంగామా చేయిస్తారు... వినోదమూ పండిస్తారు. ఈ తరహా పాత్రల్లో ఒదిగిపోయేడు హీరో ఎన్టీఆర్‌. వీరిద్దరి కలయికలో 'బాద్‌షా' తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

  English summary
  Director Srinu Vaitla has changed four cameramen for one film. All for his current movie, NTR starrer Baadshah. First the film went to the sets with cinematographer I Andrew (of Darling and Kandireega fame). He was replaced with Jayanan Vincent of Gabbar Singh fame. After filming the movie for couple of weeks, he was dropped off. Later, cinematographer R D Rajasekhar had joined the crew as Director of Photography (DoP). The film, so far, has completed 50 percent shooting and now K V Guhan is taking over.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X