వెంకటేష్‌తో జోడీ కట్టనున్న ప్రియమణి.. ఆ సినిమా కోసమే.. కన్ఫర్మ్!

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి భేష్ అనిపించుకుంది ప్రియమణి. అందుకే సౌత్ సినిమాల్లో ఆమెకు, ఆమె అందానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఓ ముస్లిం యువకుడిని పెళ్లాడిన ప్రియమణి.. ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది. అయితే తాజా సమాచారం మేరకు ఆమె తిరిగి తెలుగు తెరపై మెరవనుందని తెలుస్తోంది.

విక్టరీ వెంకటేష్ జోడిగా ప్రియమణి నటించనుందని సమాచారం. తమిళంలో హిట్టయిన 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కి తమళనాట సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందించాలని ఫిక్స్ అయ్యారు.

Priyamani will pair with Daggubati Venkatesh

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ 'అసురన్' తెలుగు రీమేక్ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణికి అవకాశం ఇచ్చారనేది లేటెస్ట్ సమాచారం. మొదటి నుంచే ఈ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ వేట ప్రారంభించిన అసురన్ చిత్రయూనిట్ మొదట శ్రీయ అనుకున్నప్పటికీ, చివరకు ప్రియమణిని సెలెక్ట్ చేసుకుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన చేయనున్నారట.

తమిళంలో వచ్చిన 'అసురన్' సినిమా ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల్చిన ఈ సినిమా 150 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ సునామీ సృష్టించింది. అంతటి సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం, అందులో వెంకటేష్ హీరోగా నటించనుండటం టాలీవుడ్ వర్గాల్లో ఎనలేని క్రేజ్ క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X