»   » రామ్ చరణ్ హీరోయిన్... 7 నిమిషాలు-రూ.6 కోట్లు

రామ్ చరణ్ హీరోయిన్... 7 నిమిషాలు-రూ.6 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రామ్ చరణ్ సరసన జంజీర్ చిత్రంలో చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో రికార్డ్ బ్రేక్ చేసింది. నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేకంగా వచ్చి వేదికపై మెరవటం కోసం ఆమె వసూలు చేస్తున్న రేట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. చెన్నైలో జరిగే వేడుకల్లో పాల్గొనడానికి ప్రియాంకచోప్రా ఆరు కోట్ల రూపాయలు అడిగిందని సమాచారం. ఇంతా చేసి ఎంత సేపు పాల్గొంటుందంటే కేవలం 7 నిమిషాలే!

అయినా సరే నిర్వాహకులు చాలా హ్యాపీగా మీరు రావటమే మాకు గొప్ప అని వెంటనే ఒప్పుకున్నారు. ఆమెకున్న అంతర్జాతీయ గుర్తింపును దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత ఎక్కువేమీ కాదంటున్నారు కొందరు. ఇందులో ప్రియాంక పాట కూడా పాడి అలరిస్తుంది. ఈ కార్యక్రమానికి అప్పుడే ప్రచారం కూడా మొదలు పెట్టేశారట. మరి ప్రియాంకా, మజాకా అంతా అంటున్నారు.

Priyanka Chopra

సినిమాల విషయానికి వస్తే... ప్రియాంక కొత్త అవతారంతో అంతటా హీటికెక్కిస్తోంది. అది క్యాబరే డ్యాన్సర్‌ పాత్ర. ఆ సినిమా వాళ్లు ఆమె నృత్య భంగిమను ఎంపిక చేసి మరీ విడుదల చేశారు. ఆ సినిమా పేరు 'గన్‌డే'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇంతకు ముందే విడుదల చేశారు, కానీ అందులో ప్రియాంక కనిపించలేదు. దాంతో యువత నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దాంతో ఈ దృశ్యాన్ని విడుదల చేయక తప్పింది కాదు.

ఇందులో ప్రియాంక పాత్ర పేరు నందిత. సినిమాలో కథ 1970ల నాటి కలకత్తా నేపథ్యంతో సాగుతుంది. అప్పటి క్యాబరే డ్యాన్సర్ల జీవితాన్ని ఈ పాత్ర ద్వారా వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ప్రయత్నిస్తున్నారు. సినిమా ట్రైలర్‌ను దుబాయ్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, అర్జున్‌ కపూర్‌, ఇర్ఫాన్‌ఖాన్‌ కూడా నటిస్తున్నారు. ఈ క్యాబరే నృత్య విన్యాసాలను వీక్షించాలంటే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

English summary

 ‘New Year’s Eve’ is one such occasion when people from the entertainment arena get golden opportunity to mint money. With actors, comedians etc charging high amount for their New Year’s performances, it seems Priyanka Chopra will soon join this league. According to a tabloid, the 31-year-old actress, who has never performed at a December 31 event, has agreed to perform at a New Year’s Eve party in Chennai. The leggy lass has apparently demanded for Rs 6 crore to shake a leg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu