»   » రెమ్యునేషన్ తగ్గించుకోమంటూ బడా నిర్మాత, ఒప్పుకోని స్టార్ హీరో, ఆగిపోతుందా?

రెమ్యునేషన్ తగ్గించుకోమంటూ బడా నిర్మాత, ఒప్పుకోని స్టార్ హీరో, ఆగిపోతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు అయితే లెక్కకు మించిన కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. వాళ్ల కష్టాలు ఎటిఎం క్యూలు, బయిట మార్కెట్లో దొరకటం వరకూ పరిమితమై ఉంటే... సెలెబ్రిటీలు అయితే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఏ విధంగా తెల్లధనంగా మార్చుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు సెలెబ్రిటీల వద్ద చెల్లని నోట్ల కట్టలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే...హీరోల పరిస్దితి వేరే రకంగా ఉంది. రెమ్యునేషన్స్ తగ్గిపోయే పరిస్దితి వస్తోంది. ఈ నేపధ్యంలో ఓ స్టార్ హీరో కు ఈ విషయమై పెద్ద సమస్య ఎదురైందంటూ.. పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదేమిటంటే...

ఆయనో స్టార్ ప్రొడ్యూసర్. ఆయన చివరి చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా సరే ఆయన తన ఇన్ఫూలియన్స్ తో ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసారు. టోకెన్ అడ్వాన్స్ లు ఇచ్చి, భారీ రెమ్యునేషన్ లు ఇస్తానని, దర్శకుడు, హీరోలను ఒప్పించాడు. కానీ పరిస్దితులు మారిపోయాయి. 1000, 500 రద్దుతో ఆయన పరిస్దితి తారుమారైంది.

Producer Asks Star Hero to Cut Remuneration!

ఆయన ఈ సినిమాకు ఫండ్స్ ని సమకూర్చటం చాలా చాలా ఇబ్బందిగా మారింది. అయితే ప్రాజెక్టు ఆపితే చాలా నష్టపోతాడు. అందుకే... హీరో,దర్శకుడుని కూర్చోబెట్టి పరిస్దితి వివరించాడట. రెమ్యునేషన్స్ మీరు తగ్గించుతీసుకోండి..ఎలాగోలా ఎరేంజ్ చేస్తాను. సినిమా రిలీజ్ అయ్యాక , వచ్చే లాభాల్లో మీకు వడ్డీ తో కలిపి మిగతా డబ్బు ఎరేంజ్ చేస్తాను అని రిక్వెస్ట్ చేసాడట.

కానీ ఆ స్టార్ డైరక్టర్, స్టార్ హీరో ఇద్దరూ కూడా ఓ కంక్లూజన్ కు రాలేదట. దాంతో నిర్మాత చాలా టెన్షన్ పడుతున్నారట. మరో ప్రక్క హీరోలకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకూ రెమ్యునేషన్స్ పడిపోతాయని మరో ప్రక్క వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.

కానీ ఇన్నాళ్లూ కోట్లకు కోట్లు తీసుకున్న హీరోలు ఈ రెమ్యునేషన్ తగ్గింపు విషయం తట్టుకోలేకపోతున్నారట. ఏదైమైనా ఆ స్టార్ హీరో ఏం నిర్ణయం తీసుకుంటాడనేది చూడాలి అంటున్నారు. ఇప్పుడు బాల్ హీరో చేతిలో ఉంది.

English summary
One tollywood Star producer is requesting the star hero, and star director to cut their remunerations to roll on the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu