For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కొత్త సినిమా నుంచి క్రేజీ న్యూస్: రీమేక్‌ మూవీలో ఆ ఎపిసోడ్ హైలైట్.. తెలుగులో తొలిసారి ఇలా!

  |

  రీఎంట్రీలో సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. అది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. దగ్గబాటి రానా.. పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సంగతులు మీకోసం!

  పవన్ లైన్ చేసిన సినిమాలు ఇవే

  పవన్ లైన్ చేసిన సినిమాలు ఇవే

  రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు'తో పాటు హరీశ్ శంకర్‌తో ఓ సినిమాను లైన్‌లో పెట్టాడు. వీటిని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాడని అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

  లేటుగా ప్రకటించినా ముందే స్టార్ట్

  లేటుగా ప్రకటించినా ముందే స్టార్ట్

  ఆ సినిమాలు అలా ఉండగానే పవన్ కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ మూవీ. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించే ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఇది ఆలస్యంగా ప్రకటించినప్పటికీ.. ముందుగానే ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది.

  అలాంటి కథలో ఇద్దరు హీరోలతో

  అలాంటి కథలో ఇద్దరు హీరోలతో

  'అయ్యప్పనుమ్ కోషియం' ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో తెరకెక్కింది. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్‌గా.. దగ్గుబాటి రానా డాన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు త్రివిక్రమ్ దీనికి మాటలతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. దీనికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

  త్వరలోనే ప్రారంభం.. టార్గెట్ ఫిక్స్

  త్వరలోనే ప్రారంభం.. టార్గెట్ ఫిక్స్

  'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌కు సంబంధించిన షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఆ తర్వాత కూడా చాలా వరకు చిత్రీకరణ జరిగింది. అంతలో కరోనా రెండో దశ రావడంతో దాన్ని నిలిపేశారు. అయితే, ఇప్పుడు షూటింగ్‌లు మొదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా జూలై 11 నుంచి పున: ప్రారంభించి.. ఆగస్టు చివరి కల్లా చిత్రీకరణను పూర్తి చేస్తారని తెలిసింది.

  ఈ మూవీలో ఆ ఎపిసోడ్ హైలైట్‌గా

  ఈ మూవీలో ఆ ఎపిసోడ్ హైలైట్‌గా

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌ కోసం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ సెట్టింగ్ నిర్మితమవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఓ ఫైట్ సీన్‌ను ప్లాన్ చేశారట. దీనితో పాటు మరో నాలుగు యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. వీటిలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  తెలుగులో తొలిసారి ఇలా చేశారు

  తెలుగులో తొలిసారి ఇలా చేశారు

  'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అదిరిపోయేలా ప్లాన్ చేశారట. ఇందులో భాగంగానే తెలుగులో గతంలో ఎన్నడూ రాని విధంగా ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. అదే సమయంలో ఓ ట్విస్ట్ కూడా ఉంటుందని.. ఆ దెబ్బతోనే సినిమా కథ మొత్తం మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఈ ఫైట్‌లో హీరోలిద్దరూ భాగం అవుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

  English summary
  Power Star Pawan Kalyan Ayyappanum Koshiyum Remake Under Saagar K Chandra Direction. In This Movie Interval Bang Fight will be Highlight
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X