'పులి' తో ఆ అమ్మాయా?

అలీ వంటి హాస్య నటుడుతో 'తిన్నామా పడుకున్నామా తెల్లారిందా' వంటి చిన్న సినిమాలో చేసిన ఆమె ఈ సినిమాకు ఎంపికవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రధాన్ కెమెరా పని నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ ఇప్పటికే రెండు అధ్భుతమైన పాటలను ఈ సినిమాకోసం స్వరపరిచారని తెలుస్తోంది. నవంబర్ లో సినిమాని పూర్తి చేసి డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











