For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోక్షజ్ఞ ఎంట్రీపై సెన్సేషనల్ న్యూస్ లీక్: లాంఛ్ చేసేది ఆ డైనమిక్ డైరెక్టరే.. బాలయ్య ప్లాన్ అదుర్స్!

  |

  చాలా కాలంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న వ్యవహారాల్లో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఒకటి. అతడు హీరోగా పరిచయం అవబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ.. ఆ విషయంపై క్లారిటీ మాత్రం రావడం లేదు. కానీ, దీనిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతుండగా.. ఎంతో మంది దర్శక నిర్మాతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మోక్షజ్ఞను చిత్ర సీమకు పరిచయం చేసే దర్శకుడి గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఇది పుకారు మాత్రం కాదని అంటున్నారు. ఆ వివరాలు మీకోసం!

  Nandamuri Mokshagna To Kick Start His Debut Soon | Filmibeat Telugu
  ఎన్టీఆర్ వారసులుగా ఈ హీరోలు

  ఎన్టీఆర్ వారసులుగా ఈ హీరోలు

  ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టాలీవుడ్‌లో తన హవాను చూపించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత తన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక, ఈ కుటుంబం నుంచి మూడో తరానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్నలు మాత్రమే హీరోగా పరిచయం అయ్యారు.

  మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు

  మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు

  నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నటసింహమే స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి బాలయ్య నటించిన వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి'లోనే మోక్షజ్ఞ నటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అది జరగకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

  లీకైన ఫిక్స్.... అభిమానులు షాక్

  లీకైన ఫిక్స్.... అభిమానులు షాక్

  కొద్ది రోజుల క్రితం నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫొటోలవి. వీటిలో మోక్షజ్ఞ లావుగా ఉండడంతో చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. దీంతో అతడు సినిమాల్లోకి రావడం కష్టమేనన్న టాక్ వినిపించిన విషక్ష్ం తెలిసిందే.

   మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ వ్యూహం

  మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ వ్యూహం

  మోక్షజ్ఞను త్వరలోనే చిత్రసీమకు పరిచయం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు బాలయ్య. ఇందులో భాగంగానే అతడి లుక్ కోసం కొందరు ట్రైనర్లను, నటనను నేర్పేందుకు కొందరు గురువులను రప్పించాడట నటసింహం. అంతేకాదు, మిగిలిన విభాగాల్లోనూ శిక్షణ ఇప్పించేందుకు కొందరు నిపుణులతో కూడిన టీమ్‌ను రెడీ చేయించాడని ఆ మధ్య ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది.

   రాజమౌళి బరిలోకి దిగాడని టాక్

  రాజమౌళి బరిలోకి దిగాడని టాక్

  బాలయ్య వారసుడి సినీ రంగ ప్రవేశం కోసం రాజమౌళి కూడా రంగంలోకి దిగినట్లు ఓ న్యూస్ అప్పట్లో హల్‌చల్ చేసింది. ఆయన అసిస్టెంట్లలో ఒకరు మోక్షజ్ఞతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ కథను కూడా బాలయ్య, జక్కన్నకు వినిపించాడని, దీంతో గురువు కొన్ని మార్పులు చెప్పనట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, కొంత భాగాన్ని ఆయనే రాశాడని అన్నారు.

  లాంఛ్ చేసేది ఆ డైనమిక్ డైరెక్టరే

  లాంఛ్ చేసేది ఆ డైనమిక్ డైరెక్టరే

  తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞను టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లాంఛ్ చేయబోతున్నాడని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే ఓ కథను బాలయ్యకు కూడా వినిపించాడట సదరు దర్శకుడు. దానికి ఫిదా అయిపోయిన నటసింహం వెంటనే దాన్ని ఓకే చేశాడని తెలుస్తోంది. 2021 చివర్లో ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

  English summary
  Nandamuri Mokshagna well trained in action and dance. He is going to raise or gear his father following soon. Currently, he is in the USA and pursuing his Management Course. After completion of his entire studies, he will quickly...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X