Just In
- 1 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
Don't Miss!
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- News
Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెంపర్ : ఎన్టీఆర్- పూరిలను గణేష్ ఇబ్బంది పెట్టాడా?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘టెంపర్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత. తాజాగా గణేష్ గురించి ఫిల్మ్ నగర్లో ఓ విషయం హాట్ టాపిక్ అయింది. నిన్న ‘టెంపర్' ఆడియో వేడుక తర్వాత ఇంది మరింత ఎక్కువయింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
‘టెంపర్' షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత బండ్ల గణేష్ దర్శకుడిని, హీరోను ఇబ్బందులకు గురి చేసాడని, పూరితో పాటు ఎన్టీఆర్‌కి రెమ్యూనరేషన్ విషయంలో కోతలు పెట్టాడని, అదే సమయంలో ఆ మధ్య షెడ్యూల్ లేటయితే డబ్బులు ఇవ్వలేదని, ఆలస్యం అయిన షెడ్యూల్ పూరి-ఎన్టీఆర్ సొంత డబ్బులతో పూర్తి చేసారని అంటున్నారు.

నిన్న జరిగిన ఆడియో వేడుకకు గెస్ట్ గా హాజరైన నిర్మాత కెఎస్ రామారావు మాట్లాడుతూ...టెంపర్ షూటింగ్ సమయంలో బండ్ల గణేష్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే ఉన్నాడు, ఆయన లేకున్నా పూరి, ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసారు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల వెనక వేరే అంతరార్థం దాగి ఉందని అంటున్నారు.
ఆ విషయాలు పక్కన పెడితే ‘టెంపర్' ఆడియోతో పాటు....థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలను బీట్ చేసే విధంగా ‘టెంపర్' ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12 లేదా 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.