»   » షాకింగ్ గాసిప్: చిరంజీవి 150వ సినిమా నుండి పూరి ఔట్?

షాకింగ్ గాసిప్: చిరంజీవి 150వ సినిమా నుండి పూరి ఔట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోల సినిమాలు మొదలయ్యాయంటే చాలు తరచూ ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ గాసిప్స్ కూడా నిజం అవుతూ ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఓ షాకింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి మెుగా అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

అయితే తాజాగా ప్రచారంలోకి వచ్చిన గాసిప్ వింటే అభిమానులు షాకవ్వాల్సిందే. చిరంజీవి 150వ సినిమా నుండి పూరి జగన్నాథ్ తప్పుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం చిరంజీవితో వివి వినాయక్ మీట్ అవ్వడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

Puri Out Of Chiru's 150th?

మరో వైపు చిరంజీవి 150 సినిమా గురించి ఈ మధ్య కాలంలో అసలు పూరి జగన్నాథ్ గానీ, బివిఎస్ రవి, కోన వెంకట్ గానీ..... అటు మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ మాట్లాడటమే మానేసారు. చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన స్టోరీపై నెలకొన్ని వివాదం కూడా ఇంకా పరిష్కారం కాలేదని సమాచారం. తన స్టోరీ కాపీ కొట్టి చిరంజీవి 150వ సినిమా కు స్టోరీ రెడీ చేసారని ఆ మధ్య ఓ వ్యక్తి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదేకాక....చిరంజీవి తన 150వ సినిమా దర్శకుడి గురించి పూర్తి స్థాయి నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ఓ వైపు రామ్ చరణ్ కూడా పూరినే చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ షాకింగ్ గాసిప్స్ ప్రచారంలోకి రావడంపై అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాలంటే....ఇటు పూరి జగన్నాథ్ తరుపు నుండి గానీ, అటు రామ్ చరణ్ తరుపు నుండి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ గాసిప్స్ సంగతి ఎలా ఉన్నా చిరంజీవి పుట్టినరోజు నాటికి 150వ సినిమాపై పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి వస్తుందని, సినిమా మొదలవుతుందిని అభిమానులు ఆశిస్తున్నారు.

English summary
Owing to the involvement of Charmi Kaur in Puri's productions and the way our director is announcing various projects with other stars before he takes up Megastar Chiranjeevi's 150th film, it's heard that Chiranjeevi is in two thoughts about the director. Also the mighty hero's Thursday meeting with VV Vinayak has fuelled speculations that the Tagore director will be back on track leaving Puri in a mess.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu