»   » ‘బ్రహ్మోత్సవం’ ఎఫెక్ట్: నిర్మాత పివిపి షాకింగ్ నిర్ణయం?

‘బ్రహ్మోత్సవం’ ఎఫెక్ట్: నిర్మాత పివిపి షాకింగ్ నిర్ణయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విదేశాల్లో ఎన్నో కష్టాలు పడి, వ్యాపారాలు చేసి, ఉన్నత స్థాయికి ఎదిగి బాగా డబ్బు సంపాదించిన ప్రసాద్ వి పొట్లూరి....ఇండియాకు వచ్చిన తర్వాత సినీ ఫైనాన్సియర్‌గా, ఆ తర్వాత 'పివిపి సినిమా' సంస్థను స్థాపించి సినీ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన చాలా సినిమాలు తీసారు. ఇప్పటి వరకు ఆయన సినిమాల ద్వారా పోగొట్టుకున్నదే ఎక్కువ. తాజాగా 'బ్రహ్మోత్సవం' కూడా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా వల్ల కూడా పివిపికి నష్టమే అని అంటున్నారు.

ఇప్పటి వరకు పివిపి సినిమా రంగంలో బాగా పొగొట్టుకుంది 'వర్ణ' సినిమా విషయంలోనే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆ సినిమా తర్వాత పివిపి ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది 'బ్రహ్మోత్సవం' విషయంలోనే అని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయంలో పెట్టిన పెట్టుబడిలో ఎంత వసూలు అవుతుందనేది హాట్ టాపిక్ అయింది.

Also Read: నాకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: పివిపి

మరో వైపు పివిపి గురించి మరో షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. బ్రహ్మోత్సవం రిజల్టుతో పివిపి చాలా డిస్సప్పాయింటుతో ఉన్నారని, ఇక సినిమా నిర్మాణం నుండి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సినిమా రంగంలో తనకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడానికి డైరెక్టర్ల వైఫల్యమే అని ఆయన ఫీలవుతున్నట్లు టాక్.

PVP Gives Up Film Production?

'బ్రహ్మోత్సవం' విషయంలో శ్రీకాంత్ అడ్డాల ముందు నుండి ప్రాపర్ గా లేరని, స్క్రీప్టు విషయంలో, షూటింగ్ విషయంలో ఆయన చాలా పొరపాట్లు చేసారని పివిపి ఇపుడు చాలా ఫీలవుతున్నారని అంటున్నారు.

పివిపి గత సినిమా ఊపిరి, క్షణం బాగానే ఆడాయి. అయితే ఊపిరి విషయంలో కూడా దర్శకుడు వంశీ పైడిపల్లి సరైన ప్లానింగ్ లేక బాగా ఖర్చు పెట్టించారని, అందుకే ఈ సినిమా వల్ల పివిపికి పెద్దగా ఒరిగిందేమీ లేదట. అయితే 'బ్రహ్మోత్సవం' రిజల్ట్ తీవ్రంగా నిరాశ పరచడంతో ఇక సినిమా రంగం తనకు అచ్చిరాదని పివిపి డిసైడ్ అయ్యాడని......నిండా మునగక ముందే తప్పుకోవాలని నిర్ణయించున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో స్వయంగా పివిపి స్పందిస్తేగానీ చెప్పలేం.

English summary
Prasad V. Potluri who has made some notable films in Telugu and Tamil cinema is going to stop producing films because of Brahmotsavam box office result.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu