For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘టెంపర్’ని రిజెక్ట్ చేసిన ఆర్.నారాయణ మూర్తి

  By Srikanya
  |

  హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఆర్.నారాయమూర్తిది ఓ ప్రత్యేక స్దానం. తనదైన కమిట్ మెంట్ తో చిత్రాలు తీస్తూ ముందుకు వెళ్తున్న ఆయన తను నమ్మిన సిద్దాంతాలనే కథలుగా తెరకెక్కించి ప్రజలను మేల్కొపుతూ ఉంటూంటారు. నిజ జీవితంలోనూ చాలా నిరాడంబరంగా ఉండే ఆయన ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ ని చూడలేదు. ఆయన సినిమాలు వచ్చినట్లే వచ్చి వెళ్ళి పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయనకు తాజాగా పూరి నుంచి ఆఫర్ వచ్చింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  మొదట ఆ పాత్ర విని ఒప్పుకున్నా ఆ తర్వాత దాన్ని రిజెక్టు చేసారని సమాచారం. పూరి కి మొదటినుంచి ఆర్.నారాయణ మూర్తి అంటే అభిమానం. అది ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ప్రారంభంలో దాన్ని అంకితం చేసే విధానంలోనే తెలుస్తుంది. అదే అభిమానంతో స్పెషల్ రోల్ ని క్రియేట్ చేసి మరీ నారాయణ మూర్తికి ఆఫర్ చేసారని టాక్.

  R Narayanamurthy rejected Temper?

  ఆఫ్ బీట్ నుంచి మెయిన్ స్ట్రీమ్ లోకి వద్దామనుకుని మరీ క్యారెక్టర్ ని ఒప్పుకున్న నారాయణమూర్తి చివరి నిముషంలో ఎందుకు రిజెక్టు చేసాడన్న దానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ తను నమ్మి కొన్ని సిద్దాంతాలతో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా కమర్షియల్ చిత్రం చేయటం ఎందుకనిపించి మానేసాడని అంటున్నారు.

  చిత్రం విశేషాలకు వస్తే...

  ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఈ చిత్రం ఆడియోని ఈ నెల 26న విడుదల చేస్తున్నారు.

  అలాగే...ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...మా బేనర్లో నిర్మిస్తున్న ‘టెంపర్' చిత్రానికి సంబంధించిన టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదల చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇపుడు రిలీజైన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్ వస్తోంది.

  ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.

  ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Puri designed a special role for him opposite NTR in his latest film Temper.Initially, R Narayana Murthy liked the role. But after a few weeks, the actor called up and declined the offer
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X