»   » రీమేక్ లో....మంచు విష్ణు, రాజ్ తరుణ్

రీమేక్ లో....మంచు విష్ణు, రాజ్ తరుణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హిట్ హీరోగా మారిన రాజ్ తరుణ్ కి వరస ఆఫర్స్ చుట్టముడుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ నిర్మిస్తున్న కుమారి 21ఎఫ్ లో చేస్తున్న రాజ్ తరుణ్ ...చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అంగీకరించాడు .

మంచు విష్ణు హీరోగా చేయనున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ ను మరో హీరోగా ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ సమాచారం. పంజాబీలో సూపర్ హిట్ అయిన ఓ కామెడీ చిత్రం రీమేక్ లో వీరిద్దరూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను చాలా కాలం క్రితమే తీసుకున్నాడు మంచు విష్ణు. అయితే అప్పటినుంచి ఈ సినిమా వాయిదా అవుతూ వస్తోంది.

Raj tarun joins with Manchu Vishnu for remake

తాజాగా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. విష్ణు తో గతంలో దేనికైనా రెడీ సినిమాను డైరెక్ట్ చేసిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోలు ఉండే ఈ సినిమా కోసం విష్ణుతో పాటు రాజ్ తరుణ్ ను మరో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు.

ప్రస్తుతం సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా సినిమాను తెరకెక్కిస్తున్న నాగేశ్వరరెడ్డి. ఆ సినిమా పూర్తయిన తరువాత విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా పని మొదలెట్టనున్నాడు.

English summary
Raj Tarun signed a film with Manchu Vishnu. ‘Doosukeltha’ Nageshwar Reddy will direct this project.
Please Wait while comments are loading...