»   » అల్లు అరవింద్,రామోజీలపై ఆరోపణ పబ్లిసిటీకోసమా

అల్లు అరవింద్,రామోజీలపై ఆరోపణ పబ్లిసిటీకోసమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అరవింద్, రామోజీరావు, సురేష్ బాబు, దిల్‌రాజులు సినిమా పరిశ్రమపై గుత్తధిపత్యం చలాయిస్తున్నారని రాజా ఆరోపించటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ఇంతకుముందు కూడా ఇదే టాపిక్ పై కొద్ది రోజుల పాటు నిరాహార దీక్షలు జరిగటాన్ని గుర్తు చేసుకుని...ఈ ఆరోపణ ఎంతవరకూ పరిష్కార దిశగా ముందుకు వెళ్తుందని మాట్లాడుకుంటున్నారు. నిన్న(బుధవారం)పెద్ద నిర్మాతల నుంచి చిన్న నిర్మాతలను రక్షించేందుకు..ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా థియేటర్లను నడిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సినీ హీరో రాజా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.అలాగే థియేటర్లను లీజుకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని కూడా కోరారు. అయితే రాజాచేసే ఈ ఆరోపణను కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ 'ఇంకోసారి' ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు.

అలాగే ఇలాంటి విషయాలను సాధారణంగా కోర్టులు పరిధిలోకి తీసుకువెళ్తూంటారని అయితే రాజా..మానవ హక్కుల కమీషన్ కి తీసుకువెళ్ళటమేమిటని అంటున్నారు. అందుకు రాజా చేసిన ఫిర్యాదు తమ పరిధిలోకి వస్తుందో లేదో పరిశీలించాల్సి ఉన్నదని కమిషన్ చైర్మన్ సుభాషణ్‌రెడ్డి పేర్కొనటాన్ని ఉదహరిస్తున్నారు. ఇక రాజా...మూడున్నర కోట్ల బడ్జెట్‌తో సుమన్ పాతూరి దర్శకత్వంలో కల్యాణ్ కల్లా నిర్మాతగా తీసిన సినిమా 'ఇంకోసారి' చిత్రాన్ని విడుదల చేయడం తమ శక్తికి మించిన పనిగా పరిణమించిందని...తన వంటి హీరో, నిర్మాత, దర్శకుల చిత్రాలు విడుదల కాకుండా అగ్ర నిర్మాతలు అడ్డుకుంటున్నారని అనంతరం రాజా ఆరోపించారు. నగరంలోని 150 థియేటర్లలో అతికష్టం మీద ఒక థియేటర్ దొరికిందని..చిత్రం విడుదల చేసిన ఐదు రోజులకే సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని థియేటర్ యజమానులు చెప్పారన్నారు. వారి వెనక ఆ నలుగురు నిర్మాతల హస్తం ఉందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu