»   » రాజమౌళి మోసం చేసాడంటూ ‘బాహుబలి’ ఆర్ట్ డైరెక్టర్ ఆవేదన

రాజమౌళి మోసం చేసాడంటూ ‘బాహుబలి’ ఆర్ట్ డైరెక్టర్ ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మీద, బాహుబలి టీం మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సినిమా సూపర్ అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనితీరు అద్భుతం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

అయితే బాహుబలి సినిమాకు పని చేసిన మరో ఆర్ట్ డైరెక్టర్ మను జగద్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రాజమౌళి, బాహుబలి టీం తనను మోసం చేసినట్లు ఆయన ఫీలవుతున్నారట. తనకు కనీసం టైటిల్ క్రెడిట్ ఇవ్వక పోవడంపై ఆవేదన చెందుతున్నాడని తెలుస్తోంది.


Rajamouli cheating?

బాహుబలి సినిమాలో విజువల్స్ అంత గొప్పగా వచ్చాయంటే అందుకు కారణం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్లు వేసిన స్కెచ్చులే. ఆ స్కెచ్చులకు విజువల్ ఎపెక్ట్స్ జోడించి తెరపై అద్భుతాలను చూపించారు. సినిమా విడుదలకు ముందు సదరు స్కెచ్చులు ఇంటర్నెట్లో అందరినీ ఆశ్యర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.


బాహుబలి సినిమాకు అసలైన ఆర్ట్ డైరెక్టర్ తానేనని, బాహుబలి సినిమా కోసం వేసిన స్కెచ్చుల్లో అధిక శాతం తాను వేసినవే అని, సాబు సిరిల్ కేవలం ఆర్ట్ డిపార్టుమెంట్‌ను కంట్రోల్ చేసే బాధ్యలు చూసుకున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కనీసం నాకు టైటిల్ క్రెడిట్స్ కూడా ఇవ్వడపోవడం దారుణం. నేనే మోసపోయాను అంటూ మను జగధ్ వాపోయినట్లు సమాచారం. మరి ఇతని వ్యాఖ్యలపై రాజమౌళి ఎల స్పందిస్తారో చూడాలి.

English summary
Art director Manu Jagadh is claiming as he has been cheated by Rajamouli and Team Baahubali.
Please Wait while comments are loading...