»   » రాజమౌళి డైరక్ట్ చేసే నాగార్జున ఎపిసోడ్ ఏమిటంటే...

రాజమౌళి డైరక్ట్ చేసే నాగార్జున ఎపిసోడ్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో నాగార్జున ఓ కీలకమైన పాత్ర చేయనున్నాడనే సంగతి తెలిసిందే. నాగార్జున ఉండే ఎపిసోడ్స్ మొత్తం రాజమౌళి డైరక్ట్ చేస్తారు. ఆ ఎపిసోడ్ గతకాలం(పీరియడ్) కాలానికి సంభందించింది అని తెలుస్తోంది. కథ ప్రకారం ఓ పిల్లాడుకి గత కాలంలో నివసించిన ఓ యోధుడు గురించి తెలుసుకుని అతన్ని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ పిల్లాడుకు అవసర కాలంలో ఆ పాత్ర(నాగార్జున) వచ్చి వాడికి సాయపడుతుంది. అప్పుడు నాగార్జున ఆ కాలంలో ఎలా ఉండేవాడు అన్న ఫ్లాష్ బ్యాక్ రివిల్ అవుతుంది. పిల్లాడికి,నాగార్జుకీ ఉండే సన్నివేశాలు హైలెట్ అవుతాయంటున్నారు. అంటే కొంచెం అటూ ఇటూగా విష్ణు వర్దన్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కృష్ణా అర్జున తరహాలో ఉంటుందని అంటున్నారు.

ఇక విజయేంద్ర ప్రసాద్..రాజమౌళి చిత్రాలుకు కథలు ఇచ్చి పాపులర్ అయిన వ్యక్తి. అలాగే ఆయన దర్శకుడుగా శ్రీకృష్ణ 2006 అనే చిత్రం డైరక్ట్ చేసారు. అయితే ఆ చిత్రం అనుకున్నంతగా విజయవంతం కాలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై నిర్మించనున్నారు.రాజమౌళి ఈ చిత్రం దర్శకత్వం గురించి హామీ ఇచ్చాకే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ కొత్త వెంచర్ కి సంభందించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu