»   » రాజమౌళి నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తో అంటూ ప్రచారం?

రాజమౌళి నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తో అంటూ ప్రచారం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా డిసైడ్ కాలేదని, త్వరలో తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకుంటున్నానీ, ఏ సినిమా చేయాలనేది అప్పుడే డిసైడ్ చేసుకుంటాను, ఎలాంటి గ్రాఫిక్స్ లేని మామూలు సినిమాను ఎంచుకుంటానేమో? అని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా టాలీవుడ్లో రాజమౌళి తర్వాతి సినిమా విషయంలో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. రాజమౌళి తర్వాతి మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నారట.

ముందే అడ్వాన్స్

ముందే అడ్వాన్స్

డివివి దానయ్య దగ్గర రాజమౌళి చాలా రోజుల క్రితమే సినిమా చేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడని, ఈ మేరకు బాహుబలి-2 తర్వాత దానయ్యతో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో రూమర్ మొదలైంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

డివివి దానయ్య దగ్గర బన్నీ డేట్స్ ఉన్నాయని, బన్నీ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు టాక్. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత లింగు స్వామి ప్రాజెక్టు చేయాల్సి ఉంది.

బన్నీ ఆసక్తిగా...

బన్నీ ఆసక్తిగా...

రాజమౌళితో సెట్టయితే లింగుస్వామి ప్రాజెక్టను పక్కన పెట్టి బన్నీ ఈ సినిమాకు కమిట్ అయ్యే అవకాశం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడం ద్వారా హీరోగా తన ఇమేజ్ మరింత పెరుగుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట.

అఫీషియల్ సమాచారం లేదు

అఫీషియల్ సమాచారం లేదు

అయితే రాజమౌళి, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. మరి దీనిపై బన్నీగానీ, రాజమౌళి గానీ, డివివి దానయ్యగానీ స్పందిస్తే తప్ప ఇందులో నిజా నిజాలు తేలే అవకాశం కనిపించడం లేదు.

English summary
The speculations are at ripe involving the director Rajamouli's next movie. Many combinations are doing the rounds and the major one seems to be that Rajamouli will be working with Allu Arjun for his next in the production of DVV Danayya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu