»   »  కృష్ణ వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ కన్ఫర్మ్

కృష్ణ వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నట కిరీటి రాజేంద్రప్రసాద్ త్వరలో కృష్ణ వంశీ దర్సకత్వంలో కనిపించనున్నారు. అయితే హీరోగా మాత్రం కాదు. కృష్ణవంశీ, గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందనున్న 'మొగుడు" (హజ్బెండ్) చిత్రంలో హీరో తండ్రిగా చేయటానికి కమిటయ్యారు. సిద్దార్ధ చిత్రం బావలో సిద్దార్ధ తండ్రిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ ఇందులోనూ పశ్చిమగోదావరి జిల్లా స్లాంగ్ తో ఓ రైతులా కనిపిస్తాడని వినిపిస్తోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కృష్ణవంశీ తనదైన టిపికల్ మార్కుతో ఈ చిత్రం స్క్రిప్టుని రూపొందించాడని, చందమామ సినిమాలా ఆహ్లాదంగా ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రం ఈ రోజు(ఆదివారం) ప్రారంభం కానుంది. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Rajendra Prasad in Krishnavamsi's 'Mogudu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu