»   » కమల్, రజనీ ...ఇద్దరి మధ్యా సూపర్ క్లాష్

కమల్, రజనీ ...ఇద్దరి మధ్యా సూపర్ క్లాష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పద్మశ్రీ కమల్, సూపర్ స్టార్ రజనీ ఇద్దరూ ఒకేసారి పోటీ పడనున్నారా. వీరిద్దరి సినిమాలు ఒకే నెలలో విడుదల కానున్నాయా... అనేది ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'కోచ్చడయాన్‌'(విక్రమ్ సింహా). రజనీకాంత్‌ పుట్టినరోజు డిసెంబరు 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు పాట తప్ప ఆడియో కూడా విడుదల కాలేదు. సినిమా డిసెంబరు మూడో వారంలో మాత్రం తెరపైకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇక కమల్‌ హీరోగా నటిస్తున్న సీక్వెల్‌ చిత్రం 'విశ్వరూపం 2'ను డిసెంబరు ఆఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి.ట్రైలర్‌, ఆడియో కూడా ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. ప్రారంభం నుంచి రజనీకాంత్‌, కమల్‌ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఈ సినిమాలు ఒకే నెలలో విడుదలైతే యువ హీరోలకూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నది కోలీవుడ్‌ వర్గాల మాట.

'కోచ్చడయాన్‌'(విక్రమ్ సింహా) చిత్రాన్ని రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్‌ కాప్చర్‌ పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ రజనీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సాంకేతిక పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కమల్ చిత్రంపైనా ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. మొదటి సినిమా వివాదాలతో మొదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుంది అని అంటున్నారు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది ఏ రేంజి హిట్ అవుతుందో చూడాలి.

English summary
Super Star Rajinikanth and Padmasri Kamal Hasan are super stars in India. Now distributors are planning to delight movie lovers by releasing their upcoming films Kochadaiyan and Viswaroopam 2 on the same day. However how far it will materialise is million dollar question.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu