»   » మామ అలుళ్ల సవాల్: రజనీతో ధనుష్ అమీతుమీ.. కాలాలో పోటాపోటీగా

మామ అలుళ్ల సవాల్: రజనీతో ధనుష్ అమీతుమీ.. కాలాలో పోటాపోటీగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రంలో విలక్షణ నటుడు ధనుష్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే కాలా చిత్రం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ చిత్రాన్ని కబాలిని రూపొందించిన పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకొంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రను పోషిస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ధనుష్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతున్నాడనే వార్తలతో కలా చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడింది.

యువ గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్

యువ గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్

కాలా చిత్రంలో ధనుష్ పోషించే పాత్ర చాలా కీలకమైంది. యువ గ్యాంగ్‌స్టర్ రజనీగా ధనుష్ కనిపించబోతున్నాడట. వయస్సు మళ్లిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీ కనిపించనుండగా, ఆయన జీవితంలోని యువకుడి కోణాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించడం కథలో భాగం. తొలుత రజనీకాంత్‌నే యువ గ్యాంగ్‌స్టర్‌గా చూపించాలని ప్రయత్నించినప్పటికీ.. ధనుష్ చేత ఆ పాత్రను వేయిస్తే చాలా కొత్తగా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమైందట.

పవర్ పాండీలో సత్తా..

పవర్ పాండీలో సత్తా..

ధనుష్ తాజాగా పవర్ పాండీ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో యువ రాజ్ కిరణ్ పాత్రను పోషించి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాడు. నటుడిగా ఇప్పటికే ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్న ధనుష్ దర్శకత్వం బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి మెప్పించాడు. విమర్శకులు సైతం ధనుష్ ఫెర్మార్మెన్స్‌పై ప్రశంసలు గుప్పించారు. పవర్ పాండి చిత్రం బాహుబలి ధాటిని తట్టుకొని నిలబడటం ఆ సినిమా సత్తాను తెలియజెప్పింది.

 హాలీవుడ్ సినిమాతో బిజీ...

హాలీవుడ్ సినిమాతో బిజీ...

ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ చిత్రం ది ఎక్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఈ చిత్రంలో నటించే విషయంపై ప్రకటించే విషయంపై మీడియా స్పందన కోరగా అందుకు ధనుష్ నిరాకరించాడు. ఇండియాకు తిరిగి వచ్చిన త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తాను అని చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రం కోసం ముంబైలో భారీ సెట్‌ను వేసి చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

 నిర్మాతగా ధనుష్..

నిర్మాతగా ధనుష్..

ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కాలా చిత్రంలో హ్యుమా ఖురేషీ, నానాపాటేకర్, సముద్రఖని, అంజలిపాటిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2018 రెండో భాగంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వీఐపీ2, ఎనాయ్ నోకి పాయుమ్ థోట్ట చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే వీఐపీ ఆడియోను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టాడు.

English summary
Reports suggests that Dhanush may have an extended cameo in superstar Rajinikanth's upcoming film Kaala Karikaalan. It's a well-known fact that superstar Rajinikanth is teaming with Kabali director Pa Ranjith for Kaala Karikaalan. As per recent developments, reports suggest that Dhanush is likely to the younger version of Thalaivar Rajinikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu