»   » షాకింగ్ న్యూస్: ‘కబాలి’ కూడా ఆన్ లైన్లో లీకైంది?

షాకింగ్ న్యూస్: ‘కబాలి’ కూడా ఆన్ లైన్లో లీకైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమా పైరసీ అంటే రిలీజైన తర్వాత థియేటర్లల నుండి రహస్యంగా చిత్రీకరించి చేసే వారు. కానీ ఇపుడు పైరసీ తీరు మారింది. సినిమా రిలీజ్ కాక ముందే, ఏకంగా ఎడిటింగ్ రూమ్ నుండే పైరసీ కాపీ బయటకు వస్తోంది.

ఈ మధ్య కాలంలో పలు సినిమా రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ కావడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు భారీగా ఖర్చు పెట్టి, ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా పైరసీని ఆరికట్టడం వారి వల్ల కావడం లేదు. లీకైన వాటిమీద సెన్సార్ కాపీ అని ఉండటంతో సెన్సార్ బోర్డు వారే సినిమాలను బయటకు లీక్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.


ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' మూవీ రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. పైరసీ మాఫియా తాజా మరో పెద్ద సినిమాపై కన్నేసారని తెలుస్తోంది. ఈ నెల 22న రిలీజ్ కాబోతున్న రజనీకాంత్ 'కబాలి' ఆల్రెడీ ఆన్ లైన్ లో లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ విషయం నిర్మాతలకు కూడా తెలుసని, దానివల్ల సినిమా డ్యామేజ్ ను అరికట్టేందుకు విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా ఒక టీం కబాలి పైరసీ లింకులను ఎక్కడికక్కడ బ్లాక్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.


లీక్ విషయం తెలిసే నిర్మాత కలైపులి ఎస్.థాను సినిమా మద్రాస్ హైకోర్టు నుండి ముందుగా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారని, పైరసీ లింకులు ఉన్న వెబ్ సైట్లను బ్లాక్ చేసేందుకే ఆయన ఈ స్టెప్ తీసుకున్నారని టాక్.


ఇదే విషయమై సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ పహ్లజ్‌ నిహ్లానీ మాట్లాడుతూ.. 'పైరసీ మహమ్మారి రజినీకాంత్‌ను కూడా విడిచిపెట్టలేదు. కబాలి చెన్నైలో సెన్సార్‌ సర్టిఫికెట్‌ అందుకుంది. కాబట్టి ముంబయిలోని మా సెన్సార్‌ బోర్డుతో ఎలాంటి సంబంధంలేదు. ఇంతకుముందు సుల్తాన్‌ కూడా లీకైందని వార్తలు వెలువడ్డాయి. కానీ కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. నాకు తెలిసి ఇలాంటి సూపర్‌స్టార్స్‌ సినిమాలు లీక్‌ అయినా పెద్దగా నష్టం ఉండదు' అని అన్నారు.


ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్

ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్

ఇంటర్నెట్లో ఆల్రెడీ కొన్ని కబాలి పైరసీ లింకులు ఉన్నాయని, అయితే వాటిని చూసేందుకు ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్ వేర్లను ఉపయోగిస్తున్నారని అంటున్నారు.


పైరసీ జరిగిందని పబ్లిక్ చేస్తే నష్టమే

పైరసీ జరిగిందని పబ్లిక్ చేస్తే నష్టమే

అయితే ఈ విషయాన్ని బయటకు చెబితే అందరికీ పైరసీ గురించి తెలిసిపోతుందనే ఉద్దేశ్యంతో ‘కబాలి' టీం సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ వెలుతోందట.


అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాపై రానంత అంచనాలు కబాలి సినిమాపై వచ్చాయి. ఈ సినిమా మినిమమ్ రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

ఇప్పటి వరకు ఏ ధక్షిణాది సినిమా కూడా రిలీజ్ అవ్వని విధంగా వేలాది థియేటర్లలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


English summary
After Salman Khan's 'Sultan' found its way online few weeks back, piracy organisations have allegedly leaked the most awaited movie of the year, Rajikanth starrer 'Kabali'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu