»   » మంచు మనోజ్ డైరక్టర్ తో ..రజనీ నెక్ట్స్

మంచు మనోజ్ డైరక్టర్ తో ..రజనీ నెక్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్యన మంచు మనోజ్ తో పోటుగాడు చిత్రం డైరక్ట్ చేసిన పవన్ వడియార్ గుర్తుండే ఉంటారు. ఆయన తన తదుపరి చిత్రం రజనీతో చేస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ కన్నడ దర్శకుడు రీసెంట్ గా రజనీని కలవటంతో ఈ విషయంలో మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కథ వినిపించాడని, రజనీ ఓకే చేసాడని రకరకాల వినపడుతున్నాయి. అయితే దర్శకుడు వైపు నుంచి మాత్రం ఎటువంటి కామెట్స్ రావటం లేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Rajinikanth to work with Pavan Wadeyar?

లింగ సినిమా తరువాత సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే చర్చ కొంతకాలంగాగా సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. లింగ ఫెయిల్యూర్ తో కసిగా ఉన్న ఈ స్టార్ హీరో.. తన నెక్ట్స్ మూవీ ఎలాగైనా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉండాలని భావిస్తున్నాడట. ఇప్పటికే కొందరు స్టార్ డైరెక్టర్లు రజనీతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని చెన్నైలో చర్చ జరుగుతోంది.


రజనీకాంత్ తో రోబో వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన దర్శకుడు శంకర్.. ఆ సినిమా సీక్వెల్ ను కూడా రజనీతోనే ప్లాన్ చేస్తున్నాడని కొందరు చెబుతున్నారు. ఇక తమిళంలో అనేక సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మురుగదాస్ సైతం.. రజనీకాంత్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. శంకర్, మురుగదాస్ సహా పలువురు కోలీవుడ్ దర్శకులు రేసులో ఉన్న రజనీకాంత్ కొత్త సినిమా కోసం.. ఇప్పుడు ఓ కన్నడ దర్శకుడు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలుస్తోంది.


Rajinikanth to work with Pavan Wadeyar?

కన్నడంలో పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పవన్ వడియార్.. రజనీతో సినిమా తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే పవన్ వడియార్ రజనీని కలిసి స్టోరీ వినిపించాడని.. అందుకు సూపర్ స్టార్ కూడా సానుకూలంగా స్పందించాడని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ వడియార్ కు రజనీ సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తే... అది నిజంగా ఓ అద్భుతమే అవుతుందని కొందరు భావిస్తున్నారు.

English summary
Now, the name of a young Kannada director is doing the rounds regarding Rajini’s next film. He is Pawan Wadeyar, the director of the Tollywood film ‘Potugadu’, which did average business.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu