»   » ఎన్టీఆర్ చేయిపడింది..పెంచేసింది

ఎన్టీఆర్ చేయిపడింది..పెంచేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోలతో చేస్తే కెరీర్ గ్రాఫ్ టక్కున మారిపోతుంది. రెమ్యునేషన్స్ కూడా అమాంతం రెట్టింపు అయిపోతాయి. ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ కు అదే జరుగుతోంది. ఆమె కు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. అందరు హీరోలు ఆమెనే కోరుకుంటున్నారు. అయితే ఆమె బ్యానర్, డైరక్టర్, హీరో వంటివే కాక రెమ్యునేషన్ ను కూడా చూసుకుంటోంది. రీసెంట్ గా ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో కమిటైనట్లు సమాచారం.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ వంటి అప్ కమింగ్ హీరో ప్రక్కన చేయాలంటే అందుకు తగ్గ ఫీజు ఆమె వసూలు చేస్తోంది. ఆమె తన రెమ్యునేషన్ ని కోటిన్నర పెంచి మరీ వసూలు చేస్తోందని సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గరుండి మరీ ఈ ప్రాజెక్టుని ఆమెకు సెట్ చేసినట్లు సమాచారం. బోయపాటితో ఇప్పుడామె సరైనోడు చిత్రం చేస్తోంది.

ఇక నాన్నకు ప్రేమతో చిత్రంలో ఆమె ఫెరఫార్మెన్స్ చూసే ఆమెను తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమా మిగతా వాళ్లకు ఏమోకానీ రకుల్ కు మాత్రం బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ సినిమాతో ఆమె క్రేజ్ పెంచుకుని సెటిల్ అయ్యే దిశలో ఉంది.

Rakul Preet hikes fee

లౌక్యం, కరెంట్ తీగ చిత్రాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆమె 50 లక్షలు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇంతకుముందు ఆమె సినిమాకు 25 లక్షలు తీసుకునేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాతో కోటిన్నర కు చేరుకుంది.

''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

English summary
With Nannaku Prematho, actress Rakul Preet Singh is now in demand and has also hiked her remuneration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu