»   » పవన్ కళ్యాణ్ కోసం రకుల్ ప్రీత్ ఆరాటం.. ఎందుకంటే..

పవన్ కళ్యాణ్ కోసం రకుల్ ప్రీత్ ఆరాటం.. ఎందుకంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మంచి జోరుమీద దూసుకెళ్తున్నది. ఇటీవల ఆమె నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రంలో రకుల్ పోషించిన భ్రమరాంబ పాత్రకు ప్రశంసలు లభించాయి. టాలీవుడ్‌లో యువ హీరోలతోపాటు, టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేశ్ బాబుతో స్పైడర్ చిత్రంలో నటిస్తున్నది. అయితే ఈ బ్యూటీకి ఓ తీరని కోరిక మనసులో ఉందట. పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నదనేది తాజా సమాచారం.

Rakul Preet Singh wants to act with Pawan Kalyan

టాప్ హీరోలతో నటించిన రకుల్ పవర్ స్టార్ పవన్‌తో ఇప్పటివరకు నటించలేదు. పవన్‌తో నటించే అవకాశం కోసం రకుల్ ఎదురుచూస్తున్నది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ తన కోరికని బయట పెట్టింది. పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది.

Rakul Preet Singh wants to act with Pawan Kalyan

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో పవన్ నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత మహా అంటే మరో సినిమాలో నటించే అవకాశం కనిపిస్తున్నది. ఆ తర్వాత రాజకీయాలకు పరిమితం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే మిస్ చేసుకోవద్దనే ఆలోచనలో రకుల్ ఉన్నట్టు తెలుస్తున్నది.

English summary
Rakul Preet Singh's latest movie is Rarandoi Veduka Chuddam. She played Bramarambha character in this movie. She doing a project with prince Mahesh Babu. Now She wants act with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu