Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రామ్ ఊపు మాములుగా లేదుగా.. మొన్న వైజాగ్, ఇప్పుడు నైజాం.. దిల్ రాజుతో కలిసి భారీ ప్లాన్!
రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ పేరుతో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 15వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. రామ్ కెరీర్ లో మొట్టమొదటిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించగా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్లు, టీజర్లు వంటివి సినిమా మీద ఆసక్తిని అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా నచ్చడంతో రామ్ ఈ సినిమాకి సంబంధించిన విశాఖపట్నం హక్కులు కొనుక్కున్నాడంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ విశాఖపట్నం హక్కులను అన్నపూర్ణ సంస్థతో కలిసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు తాజాగా వెల్లడవుతున్న సమాచారం మేరకు రామ్ నైజాం ఏరియా హక్కులు కూడా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు. దిల్ రాజుతో కలిసి ఈ సినిమా హక్కులు కొన్ని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మీద పట్టు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా మీద నమ్మకం ఉండడమే కాక తాను కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో అనుభవం తెచ్చుకోవాలని ఉద్దేశంతోనే ఇలా తన సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రామ్ ముందుకు వచ్చాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాను లింగుస్వామి తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.

సమంతతో యూటర్న్ అనే సినిమా నిర్మించిన శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను కూడా తన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తమిళ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 28 మంది అతిరథ మహారథుల సమక్షంలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇక జూలై 10వ తేదీన హైదరాబాద్ వేదికగా కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పలు యంగ్ దర్శకులు, యంగ్ హీరోలను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాని కూడా ఈ సినిమాను నిర్మించిన వారే నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను మరోసారి రామ్ తో అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తాడని భావిస్తున్నారు.