»   » హాట్ టాపిక్ : కాలేజీ స్టూడెంట్ గా రామ్ చరణ్

హాట్ టాపిక్ : కాలేజీ స్టూడెంట్ గా రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan as a college student in Boyapati's next
హైదరాబాద్ : త్వరలో రామ్ చరణ్ కాలేజీ స్టూడెంట్ గా కనపడనున్నారని సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. సెకండాఫ్ లో రివేంజ్ స్టోరీగా నడుస్తుందని,పైకి రెగ్యులర్ గా నడిచినా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కొత్తగా ఉండి నిలబెడుతుందని అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి ఈ కథ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని,స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. లెజండ్ తర్వాత బోయపాటి ఈ స్క్రిప్టు పైనే పూర్తి దృష్టి పెట్టనున్నారు.


దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. భద్ర, తులసి, సింహా లాంటి మాస్ చిత్రాల దర్శకుడు తో సినిమా చేయవటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. 2014 ద్వితీయార్థంలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటూ ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. దీంతో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు. రామ్ చరణ్ కి దర్శకుడు బోయపాటి చెప్పిన కథ చాలా బాగా నచ్చిందనీ, తన అంగీకారాన్ని కూడా తెలియజేశాడని సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్... హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రం రామ్ చరణ్ పుట్టిన రోజు అంటే మార్చి 27న ఫస్ట్ లుక్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 'గోవిందుడు అందరి వారేలే ' అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతోంది. చిత్ర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ త్వరలో చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.

English summary

 Ram Charan signed a movie under the direction of Boyapati Srinu who is well versed in directing mass masalas like Bhadra, Thulasi, Simha and Dhammu. Senior Producer KL Narayana will be making his comeback with this film under his Durga Arts banner. The project will start rolling from April and is being planned for Sankranthi 2015 release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu