»   » ‘రూలర్’ టైటిల్‌తో ఈసారి బోయపాటి...

‘రూలర్’ టైటిల్‌తో ఈసారి బోయపాటి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Ram Charan as ‘Ruler’ with Boyapati Srinu
హైదరాబాద్: ఆ మధ్య 'రూలర్'అనే పదం బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. దమ్ము సినిమాలోని ఓ పాటలో ఈ పదం వస్తుంది. అలాగే బాలకృష్ణ అధినాయుకుడు పోస్టర్స్ పై కూడా హి రూల్స్ అని వేసారు. దాంతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను చిత్రానికి ఆ టైటిల్ అనుకున్నారు. అయితే ఆ టైటిల్ కాకుండా లెజండ్ అనే టైటిల్ తో బోయపాటి ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడా టైటిల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సారి రామ్ చరణ్ కి ఈ టైటిల్ పెట్టి బోయపాటి చిత్రం చేస్తున్నాడంటున్నారు.

ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటూ ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. దీంతో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు.రామ్ చరణ్ కి దర్శకుడు బోయపాటి చెప్పిన కథ చాలా బాగా నచ్చిందనీ, తన అంగీకారాన్ని కూడా తెలియజేశాడని సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించనున్నారు.

దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ ఈ విషయమై అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ... మేము రెండు భారీ చిత్రాలతో వస్తున్నాము. త్వరలోనే ఇవి సెట్స్ కు వెళ్లనున్నాయి. అవి... మహేష్-రాజమౌళి కాంబినేషన్ చిత్రం, బోయపాటి శ్రీను-రామ్ చరణ్ చిత్రం. ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయనున్నాం. వాటి వివరాలు తర్వాత ప్రకటిస్తాం అన్నారు.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గతంలో క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం, వంటి చిత్రాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఎన్టీఆర్ తో రాఖీ చిత్రం చేసిన తర్వాత వారు గ్యాప్ ఇచ్చారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత వారు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ భారీ కాంబినేషన్ చిత్రాలు ప్రకటించారు.

English summary
Ram Charan has given green signal to a film in Boyapati Srinu direction and the film has been selected a titled as Ruler.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu