»   » ఆరెంజ్ సినిమా కిక్ ఇవ్వడం లేదు: రామ్ చరణ్

ఆరెంజ్ సినిమా కిక్ ఇవ్వడం లేదు: రామ్ చరణ్

Subscribe to Filmibeat Telugu

చిరుత సినిమా ద్వార్ పరిచయమై తన రెండవ సినిమాతోనే తిరుగులేని స్టార్ గా ఎదిగిన హీరో 'చిరుత'నయుడు, మగధీరుడు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు, పరుగు వంటి ఫ్యామిలీ సినిమాలను తీసిన భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జెనీలియా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లవర్ బోయ్ గా కనిపిస్తున్నాడు.

కాగా చరణ్ ఇటీవల తన స్నేహితులతో ఆరెంజ్ సినిమా తనకు కావాల్సినంత కిక్ ఇవ్వడం లేదని చెప్పాడట. తను నటించిన మగధీర సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు కఠోర శ్రమ పడ్డ చరణ్ కు లవర్ బాయ్ గా, చాక్లెట్ బాయ్ గా కనిపించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. దీంతో తను పెద్దగా ఛాలెంజ్ లు ఏవీ ఫేస్ చెయ్యడం లేదని ఇది కొంచం బోరుగా వుందని అతను అభిప్రాయపడ్డాడట. అయినా ఒక్క యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగులే ఛాలెంజింగా వుంటాయి అనుకుంటే ఎలా..? సెంటిమెంట్,. ప్రేమ సన్నివేశాలు పండించడం కూడా ఓ ఛాలెంజే అని చరణ్ కు తెలియదు కాబోలు..!! అయినా నటుడన్నాకా నవరసాలు పండించాలి ఇందులో ప్రేమ, సెంటిమెంట్ కూడా భాగమే ఏమంటారు..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu