twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినయ విధేయ రామ: రామ్ చరణ్ రూ. 5 కోట్లు.. మరి మిగతా రూ. 10 కోట్లు?

    |

    'వినయ విధేయ రామ' సినిమా బాక్సాఫీసు వద్ద ప్లాప్ అవ్వడం అభిమానులను మాత్రమే కాదు... రామ్ చరణ్‌ను కూడా చాలా బాధించింది. తనను నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాననే బాధ ఆయనలో అలా ఉండిపోయింది.

    ఇలాంటి విషయాలు మనసులోనే ఉంచుకుంటే ఆ పెయిన్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ భారాన్ని కాస్తయినా తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ బహిరంగ లేఖ రాశారు. సంక్రాంతికి ఎన్నో ఆశలతో థియేటర్లకు వచ్చిన వారిని నిరాశ పరిచినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

    నష్ట పోయిన బయ్యర్లను ఆదుకోవాలని రామ్ చరణ్

    నష్ట పోయిన బయ్యర్లను ఆదుకోవాలని రామ్ చరణ్

    ‘వినయ విధేయ రామ' వల్ల బయ్యర్లు దాదాపు రూ. 30 కోట్ల మేర నష్టపోయారు. వారికి ఎంతో కొంత పరిహారం చెల్లించాలనే ఆలోచనకు రామ్ చరణ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

    నిర్మాత దానయ్య కూడా అంగీకరించారా?

    నిర్మాత దానయ్య కూడా అంగీకరించారా?

    రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయానికి నిర్మాత దానయ్య కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి ఈ విషయం మాట్లాడుకున్న తర్వాత... రూ. 15 కోట్ల మేర పరిహారం చెల్లించాలని డిసైడ్ అయ్యారట. రామ్ చరణ్ తన వంతుగా తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి రూ. 5 కోట్లు తిరిగి ఇచ్చేందుకు ముందుకు వచ్చారట.

    <strong>చెక్ పోస్ట్ వద్ద రాంచరణ్ విధ్వంసం, వందల మందితో.. ఎన్టీఆర్ తొలిసారి!</strong>చెక్ పోస్ట్ వద్ద రాంచరణ్ విధ్వంసం, వందల మందితో.. ఎన్టీఆర్ తొలిసారి!

    మిగతాది నిర్మాతే భరిస్తాడా? దర్శకుడు కూడానా?

    మిగతాది నిర్మాతే భరిస్తాడా? దర్శకుడు కూడానా?

    అయితే మిగతా రూ. 10 కోట్లు దానయ్య ఒక్కరే భరిస్తారా? లేక బోయపాటిని కూడా కొంత రిటర్న్ ఇవ్వాలని అడుగుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో దర్శక, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్.

    అసంతృప్తిలో బోయపాటి?

    అసంతృప్తిలో బోయపాటి?

    సినిమా ప్లాప్ అయిందని ఒప్పుకుంటూ క్షమాపణలు కోరుతూ రామ్ చరణ్ లేఖ రాయడం బోయాపాటికి నచ్చలేదట. బోయపాటి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో కొన్ని ప్లాపులు ఉన్నప్పటికీ ఏ హీరో కూడా ఇలా పరాజయాన్ని ఒప్పుకుంటూ లేఖ రాయలేదు. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ అయిపోయారట.

    English summary
    Ram Charan and Danayya discussed on Vinaya Vidheya Rama box office result and decided to compensate fifty percent of the loss to buyers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X