For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘RRR’కు మరో బ్రేక్.. ప్యాకప్ చెబుతున్న రామ్ చరణ్.. కారణం చిరునే

|
Ram Charan To Take Long Gap For RRR Shoot || Filmibeat Telugu

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనుండగా, తారక్ మాత్రం కొమరం భీంగా నటిస్తున్నాడు.

అంగరంగ వైభవంగా ప్రారంభం

అంగరంగ వైభవంగా ప్రారంభం

‘RRR' గత సంవత్సరం నవంబర్ 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాలకు అధికారికంగా ప్రారంభమైంది. టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారధులు హాజరైన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళికి అందజేసి అక్షింతలు వేయగా, మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు.

షూటింగ్‌ ప్రారంభం

షూటింగ్‌ ప్రారంభం

ఆ తర్వాత కొద్దిరోజులకు సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ‘‘ఈరోజే ‘RRR' రోలింగ్ ప్రారంభమైంది'' అని ముగ్గురూ కలిసున్న ఫొటోను షేర్ చేశాడు. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతుందని భావించారు. అయితే, అలా జరగలేదు. దీనికి కారణం హీరోలకు గాయాలు అవడమే.

వరుస బ్రేకులు

వరుస బ్రేకులు

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే రాజమౌళి కుమారుడి వివాహం జరిగింది. అప్పుడు షూటింగ్ కొన్ని రోజులు ఆగింది. ఆ తర్వాత రామ్ చరణ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. అనంతరం తారక్ చేతికి గాయం అయింది. ఇటీవల రాజమౌళి కొన్ని రోజులు విరామం తీసుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత రామ్ చరణ్ బ్రేక్ తీసుకున్నాడు. దీంతో షూటింగ్‌కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి.

తప్పుకుంటున్న రామ్ చరణ్

తప్పుకుంటున్న రామ్ చరణ్

ఇప్పుడు అందరూ అందుబాటులో ఉండడంతో షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో షెడ్యూల్ చేస్తున్నారు. అయితే, కొద్దిరోజుల్లో రామ్ చరణ్ మరోసారి బ్రేక్ తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ రాజమౌళికి ముందుగానే సమాచారం ఇచ్చాడని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

కారణం చిరు సినిమానే

కారణం చిరు సినిమానే

రామ్ చరణ్ బ్రేక్ తీసుకోడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి' సినిమానే అని తెలుస్తోంది. ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనికి రామ్ చరణే నిర్మాత కావడంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా..

ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా..

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా' కోసం రామ్ చరణ్ సరికొత్త ప్లాన్లు వేస్తున్నారని అంటున్నారు. టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టాలని ఆయన భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలు ఇప్పటికే రచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

‘సైరా: నరసింహారెడ్డి’ గురించి..

‘సైరా: నరసింహారెడ్డి’ గురించి..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

English summary
RRR will release in multiple languages and it slated to hit the theatres on July 30, 2020. Samuthirakani and Ajay Devgn are other actors who are part of the upcoming film, which is produced on a huge budget of about Rs 300 crore.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more