»   » ‘మగధీరు’ని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ‘ఖైదీ’..!

‘మగధీరు’ని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ‘ఖైదీ’..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న చేయబోతున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే 'ఖైదీ"ని మళ్ళీ చెయ్యాలన్నది రామ్ చరణ్ డ్రీమ్. అతని డ్రీమ్ నిజం కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ ఏవిషయమూ అఫిషియల్ గా బయటికి రాలేదు.

కాగా మూడు దశాబ్ధాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితలుగా పనిచేస్తూ.... పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్. మూడు వందల చిత్రాలకు పైగా కథ, మాటల రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ కి ఓ కోరిక ఉందట. అదేమిటంటే... చిరంజీవి కెరీర్ లోనూ, తమ కెరీర్ లోనూ మరచిపోలేని చిత్రంగా నిలిచిన 'ఖైదీ' సినిమాని రామ్ చరణ్ తో రీమేక్ చేయాలనేది! స్ర్కిప్ట్ వర్క్ కూడా ప్రారంభించారు. ఇటీవల చిరంజీవికి కూడా ఈ విషయం చెప్పారు. ఆయన ఓకే అంటే వెంటనే పూర్తి స్ర్కిప్ట్ ను సిద్దం చేస్తామంటున్నారు.

దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారంది కాబట్టి 'ఖైదీ"ని ఈ ట్రెండ్ కు సూటైయే విధంగా స్క్రిప్ట్ మార్చి వర్కవుట్ చేస్తే రామ్ చరణ్ కెరీర్ లోనూ అదో మైల్ స్టోన్ అవుతుందన్నది సినీ పండితుల అభిప్రాయం. కాగా 'ఖైదీ"లోని యాంటీ క్లైమాక్స్ ని మరో యాంగిల్ కి మార్చి హీరోయిజాన్ని ఇంకా హైట్స్ కి తీసుకువెళ్లే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. సో నిజంగా ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే ఖచ్చితంగా 'మగధీరు"ని ఖాతా లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశించవచ్చు.

English summary
If reports are to be believed, tollywood's upcoming mega star Ram Charan Teja will be the hero in the remake of director Kodandarami Reddy's Khaidi(1983), the first major sensational hit by his father Chiranjeevi. more details are awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu