»   »  రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గెస్ట్ లుగా...రికార్డ్ లు బ్రద్దులవుతాయోమో

రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గెస్ట్ లుగా...రికార్డ్ లు బ్రద్దులవుతాయోమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పరవ్ స్టార్ , మెగా పవర్ స్టార్ ఒకే సినిమాలో గెస్ట్ లుగా నటిస్తే ఎలా ఉంటుంది..ఆ ..అది జరిగేపనేనా అంటున్నారా..అయితే అందుకు జరిగేందుకు అవకాసముందని తెలుస్తోంది. చిరంజీవి 150 వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న నేపధ్యంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కనిపించాలని నిర్ణయంచుకున్నట్లు సమచారం.

ఈ మేరకు చిరంజీవి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇది తన 150 వ చిత్రం మాత్రమేనని, ఇదేమీ తన ఆఖరి చిత్రం కాదు కదా..ఎందుకు మీరంతా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే రామ్ చరణ్ మాత్రం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

. ఇక.. చిరంజీవి 150వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారాయన. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కత్తి' చిత్రం రీమేక్‌లో చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తమిళ టైటిల్‌నే తెలుగుకి కూడా పెడతారనే టాక్ వినిపించింది.అయితే, 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌ని ఫైనల్ చేసారని , చిరునే చెప్పి ఆనందపరిచారు.

Ram Charan,pawan guest roles in CHiru's 150?

మరో ప్రక్క..ఈ 150వ చిత్రం... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు...? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. ముఖ్యంగా ఈ చిత్ర మాతృక కథ మీద వివాదం చెలరేగడంతో కొంత కాలం హాట్ టాపిక్‌గా మారింది.

అయితే వీవీ వినాయక్ మాత్రం ఆ వివాదాలేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతున్నట్లు సమచారం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్ది, చిరంజీవికి కూడా వినిపించారని సమాచారం.

స్క్రిప్ట్ విన్న చిరంజీవి ఆనందపడిపోయి, వినాయక్‌ను హగ్ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో ఇక షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం. ఈ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా నయనతార పేరు వినపడుతోంది.

English summary
Ram Charan and Pawan Kalyan will be seen in guest roles CHiru's 150 th movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu