»   » షాకింగ్: రామ్ చరణ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

షాకింగ్: రామ్ చరణ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ షాకింగ్ న్యూస్ అభిమానులకు, ప్రేక్షకులకు ఏ మాత్రం కాదు.....అయితే నిర్మాతలకు మాత్రం ఇది ముమ్మాటికీ షాకింగ్ న్యూసే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను పట్టుకోవడం మామూలు స్థాయి ప్రొడ్యూసర్లుక ఇకపై సాధ్యం కాదేమో. భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలు అయితే తప్ప ఇకపై ఆయనతో సినిమాలు తీయడానికి సాహసం చేయలేని పరిస్థితి. ఎందుకంటే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో ఇపుడు కొండెక్కి కూర్చున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం....కృష్ణ వంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి రామ్ చరణ్ ఏకంగా రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు మాత్రమే 15 కోట్ల రేంజిలో ఉన్నారు. ఇటీవల రభస చిత్రానికి కూడా జూ ఎన్టీఆర్ 15 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా చేరి పోయాడు.

Ramcharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం నిరాడంబరంగా ఫిలింనగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలతో నిన్న(ఫిబ్రవరి 6) జరిగింది.

రామ్ చరణ్ దేవుడి పటాలపై చిత్రీకరించి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సత్యరంగయ్య ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌ చిత్రమిది. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు కృష్ణ వంశీ అద్భుతమైన కథను రెడీ చేసారు అన్నారు.

రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించలేదు. రామ్ చరణ్, కాజల్ కాంబినేసన్లో వచ్చిన మగధీర, నాయక్, ఎవడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇదే కాంబినేషన్లో వస్తున్న మా చిత్రం బ్లాక్ బస్టర్ కొడుతుందని నమ్ముతున్నాను అన్నారు.

English summary
Film Nagar source said that, Ram Charan hikes renumeration. Charan has reportedly pocketed Rs.15 crores for his upcoming multi-starrrer and producer Bandla Ganesh didn't mind paying his fancy price, since he knows that he is big crowd puller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu