»   » పవన్ డేట్స్ లేకే రామ్ చరణ్ తో..?

పవన్ డేట్స్ లేకే రామ్ చరణ్ తో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్టు చేయమని చాలా కాలం క్రిందట నిర్మాత గణేష్ బాబు..పూరీ జగన్ కి అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. అయితే పూరీ కాస్త సక్సెస్ లోకి వచ్చి చేద్దామనుకునే సమయానికి పవన్ పూర్తి స్ధాయిలో బిజీగా వరస ప్రాజెక్టులు సైన్ చేస్తూ పోయారు. దాంతో గణేష్ బాబు వెంటనే ఆ ప్రాజెక్టుని రామ్ చరణ్ తో చేయటం బెస్టని నిర్ణయానకి వచ్చారు. పవన్ కోసం ఆగాలంటే మినిమం ఏడాదిన్నర ఆగాలని పవన్ స్పష్టం చేయటంతో ఇలా డిసైడ్ చేసారు. దాంతో వెంటనే గణేష్ బాబు పూరీ సంప్రదించి చరణ్ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారు.

ప్రస్తుతం పూరి మహేష్‌ బాబుతో 'ది బిజినెస్‌ మేన్‌' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇదే చిత్రాన్ని అభిషేక్‌ బచ్చన్‌తో హిందీలో రీమేక్‌ చేస్తారు. ఆ తర్వాత రవితేజతో 'ఇడియట్‌ 2' చేస్తారు. వీటి అనంతరం గణేష్ బాబు చిత్రం ఉంటుంది. ఇక గణేష్ బాబు తీన్ మార్ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం ప్లాన్ చేసారు. బాలీవుడ్ హిట్ దబాంగ్ రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆ చిత్రం ప్రారంభం కానుంది.

English summary
Producer Ganesh Babu has paid money to Puri Jagannath to prepare a script for Pawan Kalyan. As Pawan Kalyan is busy with various projects for the next two years, Ganesh Babu wants to replace Pawan with Charan for Puri script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu