»   »  రామ్‌చరణ్ - కృష్ణవంశీ చిత్రం టైటిల్ ఇదేనా??

రామ్‌చరణ్ - కృష్ణవంశీ చిత్రం టైటిల్ ఇదేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan
హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6 నుంచి జరగనున్న ఈ చిత్రానికి 'గోవిందుడు అందరివాడేలే' అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అందరివాడు చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు గోవిందు. అందులో ఒకటి ...రెండు..మూడు.. గోవిందుడు అందరివాడు... అంటూ ఓ పాట ఉంటుంది. ఇప్పుడదే టైటిల్ గా పెట్టడానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఇక పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. మరో జంటగా శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ కనిపించనున్నారు. చరణ్ తాతయ్యగా తమిళ సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ఓ కీలక భూమిక చేస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి బండ్ల శివబాబు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.

నిర్మాత గణేశ్ మాట్లాడుతూ "రామ్‌చరణ్, కాజల్ జంటగా నటిస్తున్న మూడో సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మగధీర', 'నాయక్' ఏ రేంజి హిట్ సినిమాలో మనకు తెలుసు. మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్ అనగానే ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. ఈ నెల 26న రామానాయుడు సినీ విలేజ్‌లో సెట్ నిర్మాణం మొదలవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. చరణ్ కెరీర్‌లోనే నెంబర్‌వన్ సినిమాగా నిలిపేందుకు మా యూనిట్ అంతా శ్రమిస్తున్నారు'' అని చెప్పారు.

English summary
Ram Charan's upcoming Movie under the Direction of Krishna Vamsi Titled as 'Govindudu Andarivadele' and it was not Officially. Kamalinee Mukharjee will be pairing up with Srikanth in the film. Kajal Agarwal romances Ram Charan in this drama, which is a family entertainer. Movie Music composed by SS Thamman and Produced by Bandla Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu