»   » రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రం ఆగిపోయిందా??

రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రం ఆగిపోయిందా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

'చిరుత"నయుడిగా వెండి తెరకు పరచయమై 'మగధీర" తో టాలీవుడ్ రికార్డులను బ్రద్దలు చేసిన రామ్ చరణ్ ఈ రెండు చిత్రాల తర్వాత రాబోయే మూడో చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..హ్యాట్రిక్ ను మిస్ కాకూడదని గట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నాగబాబు నిర్మాణంలో రూపొందుతున్న 'ఆరెంజ్" చిత్ర కథ రామ్ చరణ్ కు అంతగా నచ్చకపోవడంతో హ్యాట్రిక్ ఎక్కడ మిస్ అవుతాడో అని చెప్పి ధరణి చిత్రాన్ని లైన్ లో పెట్టినట్టుగా ఈ చిత్రం తర్వాత ఆరెంజ్ చిత్రాన్ని కాస్త మార్పు చేసి రూపొందించనున్నట్టుగా సమాచారం.

అయితే రామ్ చరణ్ మూడవ చిత్రం 'ఆరెంజ్" యూనిట్ లో గొడవలు వస్తున్నాయంటూ వచ్చిన వార్తలు తెలిసిందే. దర్శకుడు భాస్కర్ కూడా అలిగాడని, చిత్రానికి సరిగా సహకరించడం లేదనీ మీడియాలో వర్తలు వచ్చిన తరుణంలో మూడవ చిత్రానికి ధరణి చెప్పిన కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ ఆ చిత్రాన్ని ఇష్టపడుతున్నాడనీ తెలుస్తున్నది. అంతేకాదండోయ్యే ఈ చిత్రం ఎవరీకి తెలియకుండానే ప్రారంభమై షూటింగ్ కూడా జరుపుకుంటుందనీ రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను రహాస్యంగా ఉంచారు. దీనంతా చూస్తుంటే 'ఆరెంజ్" సినిమా కంటే ముందు ధరణి దర్శకత్వంలో రూపుదిద్దుకునే చిత్రం వస్తుందని వార్తలు వస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu