»   » గుడ్ న్యూస్: రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడా?

గుడ్ న్యూస్: రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడా? మెగా కుటుంబంలో మరో బుల్లి మెగాస్టార్ జన్మించబోతున్నాడా? అంటే అవును అనే సంకేతాలు వినిపిస్తున్నాయి మెగా సన్నిహిత వర్గాల నుండి. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది. అభిమానులు కూడా త్వరలోనే ఈ శుభవార్త వినాలని ఆశ పడుతున్నారు.

రామ్ చరణ్, తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటు రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు, అటు ఉపాసన ఫ్యామిలీ కూడా సంఘంలో బాగా పేరున్న కుటుంబాలు కావడంతో దేశం నలుమూలల నుంచి సినీ, వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా, సాఫీగా సాగుతోంది. రామ్ చరణ్ తన సినిమా ప్రొఫెషన్లో బిజీగా గడుపుతుంటే, ఉపాసన కూడా తను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, అతన్ని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో సంతోషకర విషయమని ఉపాసన చెబుతుంటారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని ఉపాసన మాటల్లో స్పష్టం అవుతోంది. రామ్ చరణ్‌తో ఉపాసన సంసార జీవితంతో ఎంతో సంతోషంగా సాగుతోంది. చరణ్ తన ఆలోచనలకు ఎంతో విలువ విలునిస్తాడని, అన్ని విషయాల్లోనూ తనకు సపోర్ట్‌గా నిలుస్తాడిన అంటుంటారు ఉపాసన.

English summary
Film Nagar sources say that Mega Powerstar ‘Ramcharan’ to become father..!!. Celebrations have started in Mega family compound regarding this. Official confirmation is yet to be made.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu