»   » రామ్ చరణ్-ఉపాసన నుండి గుడ్ న్యూస్...?

రామ్ చరణ్-ఉపాసన నుండి గుడ్ న్యూస్...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల నుండి గుడ్ న్యూస్ వినబోతున్నామా?.....అంటే అవుననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గుడ్ న్యూస్ అనగానే మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఉపాసన తల్లి కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Upasana

అయితే ఉపాసన ప్రెగ్నెన్సీ విషయమై అఫీషియల్ సమాచారం ఇప్పటి వరకు ఏమీ లేదు. కానీ ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆమె గర్భం దాల్చిందనే వార్తలకు ఊతం ఇస్తున్నాయి. ప్రస్తుతం రమోనా దగ్గర ఫిట్ నెస్ ట్రయినింగ్ తీసుకుంటున్న ఆమె మాట్లాడుతూ...``అటు ప్రీ ప్రెగ్నెన్సీ, ఇటు పోస్ట్ ప్రెగ్నెన్సీలో పెరిగే బ‌రువు గురించి నాకు చాలా సందేహాలు ఉండేవి. కానీ రమోనాను క‌లిసిన త‌ర్వాత అవ‌న్నీ పటాపంచ‌ల‌య్యాయి`` అని చెప్పుకొచ్చింది ఉపాస‌న‌. దీన్ని బట్టి ఆమె గర్భం దాల్చిందనే వార్తలు, గర్భం దాల్చడానికి రెడీ అవుతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిజా నిజాలు తేలాల్సి ఉంది.

హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ రమోనా బ్రగాంజా హైదరాబాద్ వాసులకు శిక్షణ ఇచ్చేందుకు సిటీలో ల్యాండ్ అయ్యారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలోని అపోలో లైఫ్ ఫిట్‌నెస్ సెంటర్‌లో రమోనా నెల రోజులపాటు శిక్షణ(ఏప్రిల్ 7 వరకు) ఇస్తారు. ఈ మేరకు ఆమెను నగర వాసులకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో లైఫ్ నిర్వాహకురాలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన మాట్లాడుతూ...‘జెస్సికా అల్బా, హల్లీబెర్రీ, అన్నాహాత్‌వే తదితర హాలీవుడ్ నటులకు శిక్షకురాలిగా రమోనా పేరొందారు. వారందరికీ విజయవంతంగా శిక్షణనిచ్చి... వారి ఫిజిక్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సేవలు హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. నేను కూడా కొంత కాలంగా రమోనా సూచనలు తీసుకొంటున్నా. ఇకపై ఆమె శిక్షణలో నా ఫిజిక్ మరింతగా మెరుగవుతుందని ఆశిస్తున్నా. మహిళలందరూ స్వయంశక్తితో ఎదగాలని కోరుకుంటూ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్ ట్రైనర్లుగా మరింత మంది మహిళలు రావాలనేది నా ఆకాంక్ష' అని చెప్పారు.

English summary
If a latest grapevine is to be believed, Ram Charan wife Upasana Kamineni is pregnant, so the Mega Power Star to become father soon.
Please Wait while comments are loading...