»   » మెగా క్యాంప్ కు లీడర్ దొరికాడా.. పవన్ కళ్యాణ్ తరువాత రాంచరణేనా!

మెగా క్యాంప్ కు లీడర్ దొరికాడా.. పవన్ కళ్యాణ్ తరువాత రాంచరణేనా!

Subscribe to Filmibeat Telugu

రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాంచరణ్ నటించిన ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాంచరణ్ అద్భుత నటనతో మెప్పించాడు. మగధీర తరువాత చరణ్ కెరీర్ లో రంగస్థలం చిత్రం అత్యుత్తమ చిత్రంగా చెప్పొచ్చు. సుకుమార్ ఆలోచనకు రాంచరణ్ చిట్టిబాబు పాత్రలో నటించి ప్రాణం పోశాడు. సుకుమార్ కు ఏ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయో అంతే స్థాయిలో రాంచరణ్ పైకూడా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కుడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాంచరణ్ కు రంగస్థలం చిత్రం ద్వారా మరింతగా ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. తాజగా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ప్రకారం పవన్ కళ్యాణ్ తరువాత రాంచరణ్ ఆ స్థానానికి చేరువగా వచ్చాడనే వాదన వినిపిస్తోంది.

 టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్

టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కాలం టాలీవుడ్ లో నెం 1 గా కొనసాగాడు. ఆ తరువాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో నెం 1 స్థానం ఖాళీ ఏర్పడింది.

మెగా అభిమానులకు భరోసా ఇచ్చిన పవన్

మెగా అభిమానులకు భరోసా ఇచ్చిన పవన్

చిరు రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత చాలా కాలం టాలీవుడ్ లో నెం స్థానం గురించి చర్చ జరిగింది. అప్పటి వరకు పరాజయాలతో సతమతం అవుతున్న పవన్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్ర విజయాలతో రేసులోకి వచ్చాడు. దీనితో మెగా అభిమానుల నుంచి పవన్ కు తిరుగులేని సపోర్ట్ లభించింది. చిరంజీవి తరువాత పవన్ కల్యాణే అని మెగా ఫాన్స్ భావించారు.

సినిమాలకు పవర్ స్టార్ గుడ్ బై

సినిమాలకు పవర్ స్టార్ గుడ్ బై

అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాడు. దీనితో మరో మారు మెగా క్యాంప్ లో చిరంజీవి స్థానం ఎవరిది అనే చర్చ మొదలైంది.

 పవన్ తరువాత రాంచరణేనా

పవన్ తరువాత రాంచరణేనా

మగధీర తరువాత కూడా రాంచరణ్ కూడా హిట్స్ పడ్డాయి.కానీ రంగస్థలం చిత్రం మగధీరని మించే విజయం సాధించడంతో మెగా ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తరువాత రాంచరణే అనే అంచనాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

అల్లు అర్జున్ కూడా

అల్లు అర్జున్ కూడా

మెగా క్యాంప్ లో ఉన్నా మరో స్టార్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు ఇటీవల అదిరిపోయే హిట్స్ పడ్డాయి. కానీ బన్నీకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడంతో.. చిరంజీవి తరువాత పవన్.. ఇప్పుడు వారి వారసత్వాన్ని కొససాగించే హీరో ఎవరు అనే ప్రశ్నకు బన్నీ పేరు వినిపించడం లేదు. మెగా ఫాన్స్ అంతా రాంచరణ్ పైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎట్టకేలకు రంగస్థలం లాంటి హిట్ పడడంతో ఆ అంచనాలు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు.

English summary
Ram Charan will occupy Pawan Kalyan position. After Rangasthalam huge expectations on Ram Charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X