»   » అదే ఇదా? రామ్ గోపాల్ వర్మ ‘సెక్స్’ సినిమా

అదే ఇదా? రామ్ గోపాల్ వర్మ ‘సెక్స్’ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదం, సంచలనంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఆయన త్వరలో పోర్న్ మూవీ తీయబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందుకోసం అమెరికా అడల్ట్ స్టార్ టోరీ బ్లాక్‌ను వర్మ సంప్రదించారని ఓ ఆంగ్ల పత్రిక కథనం. రామ్‌ గోపాల్ వర్మ ఈ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్తాడని, సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి ఈ పోర్న్ సినిమా సెట్స్ పైకి వెలుతుందట.

వర్మ కొన్ని రోజుల క్రితం శృంగార సినిమా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు 'XES'. ఈచిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా వర్మ అప్పట్లో తన ట్విట్టర్లో ట్వీట్ చేసారు. బహుషా ఇదే సినిమా.... తాజాగా పోర్న్ మూవీగా ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Ram Gopal Varma To Make a adult Film?

ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ......శృంగార చిత్రం మాత్రం తెరకెక్కించలేదు. 'XES' చిత్రం ద్వారా తన కెరీర్లో ఉన్న ఆ వెలితిని పూడ్చ బోతున్నారు వర్మ. 'కెరీర్ మొదటలు పెట్టిన తర్వాత అన్ని రకాల సినిమాలు తీసాను. శివ (స్టూడెంట్ పాలిటిక్స్), రంగీలా (లవ్ స్టోరీ), భూత్ (హారర్), సత్య (గ్యాంగ్ స్టర్), దౌడ్ (కాపర్), సర్కార్ (డ్రామా), కౌన్ (సైకలాజికల్ థ్రిల్లర్), అటాక్స్ ఆఫ్ 26/11 (టెర్రరిజం) ఇలా చాలా రకాలు చేసాను. కానీ ఇప్పటి వరకు శృంగార ప్రధానమైన సినిమా మాత్రం చేయలేదు. ఇపుడు చేయాలనుకుంటున్నాను. 'XES' టైటిల్‌తో ఈ సినిమా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ అప్పట్లో తెలిపారు.

సాధారణ సెక్స్ చిత్రాల్లా కాకుండా ఈచిత్రాన్ని డిఫరెంటుగా, తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. సెక్స్ గురించి మనిషి ఆలోచనల్లోని ఆరు డిఫరెంటు సిచ్యువేషన్స్ ....ఒకే స్టోరీలో చూపించబోతున్నారు. సెక్స్‌కు సంబంధమైన అంశాల్లో..... నేరము, ద్రోహం, హెల్ప్‌లెస్‌నెస్, ఎంబరాస్మెంట్, హర్ట్, ఇవన్నీ కలిపి ఒక యాంగిల్ చూపించబోతున్నామని వర్మ కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చారు.

English summary
RGV is moving on in career and he's now planning something shocker for his next. The auteur of films like Rangeela, Satya, Sarkar, this time around, gearing up to make an adult movie.
Please Wait while comments are loading...