»   » అల్లు అర్జున్ స్క్రిప్టు...రామ్ తో ?

అల్లు అర్జున్ స్క్రిప్టు...రామ్ తో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అల్లు అర్జున్ తో అప్పట్లో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ...తిక్కరేగితే అనే టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తో చేసిన రభస చిత్రం ఫ్లాఫ్ కావటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడా స్క్రిప్టు రామ్ దగ్గరకు వచ్చి ఓకే అయినట్లు సమాచారం.

శివమ్ ఫ్లాప్ తర్వాత హీరో రామ్ హిట్ కోట్టాలని కుతుహులంగా ఉన్నాడు. గతంలో సంతోష్ శ్రీనివాస్ 'కందీరీగ' వంటి సుపర్ హిట్ ఇచ్చిన ఈ డైరక్టర్, రామ్ కి మరో కోత్త కథ వినిపించాడు. ఈ స్టోరి లైన్ రామ్ కి బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్టు సమాచారం. దీనికి 'తిక్కరేగితే' అన్న టైటిల్ ఖరారు అవుతుందనుకుంటున్నారు.

రామ్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

ప్రస్తుతం రామ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నేను...శైలజ'. కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జనవరి 1, 2016లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Ram next movie is tikkaregite?

నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ...‘ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. సంవత్సర కాలం పాటు స్క్రిప్టు వర్క్ పక్కాగా చేసిన తర్వాతే తెరకెక్కించాం. సినిమా అందరికీ నచ్చుతుందిని' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...‘నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథరాసుకున్నాను. మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్. సినిమాలోని ప్రతి సీన్ నిజ జీవితానికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది' అన్నారు.

ఈ సినిమాలో సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణ చైతన్య, ప్రదీప్ రావత్, ధన్య బాలకృష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభటల్, అనంత్ శ్రీరామ్, సాగర్, డాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్ రక్షిత్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, దేవిశ్రీ ప్రసాద్, అసోసియేట్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్య, నిర్మాత: స్రవంతి రవికిషోర్. రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.

English summary
Director Santosh Srinivas recently narrated ‘Tikkaregithe’ story to Ram and he loved it at once.
Please Wait while comments are loading...