»   » నమ్ముతారా? :గుడ్డివాడి పాత్రలో రామ్

నమ్ముతారా? :గుడ్డివాడి పాత్రలో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పటాస్‌, సుప్రీమ్‌ చిత్రాల హిట్ కొట్టడంతో దర్శకుడు అనిల్‌ రావిపూడి కి టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. దాంతో హీరో రామ్ ఆయనతో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. ప్రేమకథకు అనుసంధానంగా ఉండే మాస్‌ మసాలా చిత్రానికి స్క్రిప్ట్‌ తో షూటింగ్ రెడీ అయ్యారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ ..గుడ్డి వాడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

సాధారణంగా మన హీరోలు, గుడ్డి, చెవిటి, మూగ వంటి వైకల్యం ఉన్న పాత్రలు చేయటానికి ఇష్టపడరు. కమర్షియల్ రంగు,హంగులతో ఉండే కలర్ ఫుల్ చిత్రాలు చేయటంపైనే ఆసక్తి చూపిస్తూంటారు. అయితే ఇదో పక్కా కమర్షియల్ చిత్రం అని చెప్తున్నారు.

Ram to play blind character in Anil's next

తన రెండు చిత్రాలు లాగే అనీల్ రావిపూడి ఈ చిత్రం కథను కూడా పూర్తి మాస్ గా రెడీ చేసినట్లు సమాచారం. రామ్‌ ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిస్తోంది.

English summary
Ram is going to play a blind person’s role under Anil Ravipudi direction .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu